Earthquakes In Bangladesh: శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్.. మంచు తెరలు వీడిపోలేదు. సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. ఇంకా చాలామంది మగత నిద్ర నుంచి తేరు కోలేదు. జనం ఇంతలోనే హాహాకారాలు చేసుకుంటూ బయటికి వచ్చారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు బంగ్లాదేశ్ మొత్తం ఊగడం మొదలుపెట్టింది. చాలామంది గృహాలలో ఉన్న సామాను కింద పడింది.. రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఊగిపోయారు. అక్కడి పరిణామాలను పరిశీలించి చూస్తే భూకంపం చోటుచేసుకుందని అర్థమైంది. రిక్టర్ స్కేల్ పై 5.7 గా భూకంప తీవ్రత నమోదయింది.
బంగ్లాదేశ్ కు సరిహద్దులో ఉన్న కోల్ కతా లో కూడా భూమి కంపించింది. దీంతో జనం బయటికి వచ్చి ఆందోళనకు గురయ్యారు.. ఇక్కడ కూడా 5.7 భూకంప తీవ్రత నమోదయింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా నగరంలో భూమిలో ప్రకంపనలు నమోదు అయినట్టు అధికారులు వెల్లడించారు.. బంగ్లాదేశ్లో భూమి కంపించిన నేపథ్యంలో ఆ ప్రభావం కోల్ కతా మీద కూడా పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. బంగ్లాదేశ్లో భూమిలో ప్రకంపనలు నమోదు కావడం వెనుక ఉన్న కారణాలు ఏమిటో విశ్లేషిస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వాస్తవానికి బంగ్లాదేశ్ ప్రాంతం హై రిస్క్ ఏరియాలో లేదు. గతంలో ఇక్కడ భారీగా భూకంపాలు చోటు చేసుకున్న చరిత్ర కూడా లేదు. కానీ ఎన్నడు లేనివిధంగా ఈ ప్రాంతంలో భూమి కంపించిపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోల్ కతా ఏరియాలో కూడా భూమి లో ప్రకంపనలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.. అయితే ఈ ప్రాంతంలో భారీగా నష్టం నమోదు కాకపోయినప్పటికీ ఉన్నట్టుండి భూమిలో ఇలా కదలికలు చోటు చేసుకోవడం శాస్త్రవేత్తలను సైతం నివ్వెర పరుస్తోంది.. అయితే ఈ ప్రాంతంలో మళ్లీ భూకంపాలు వస్తాయా? భూమి ఎందుకిలా ఒక్కసారిగా కదిలింది? అనే అంశాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు.
భూ అంతర్గత పొరల్లో కదలికల వల్లే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అప్పుడప్పుడు భూమి అంతర్గతంలో ఉన్న టెక్టోనియల్ ప్లేట్లలో కదలికలు చోటు చేసుకుంటాయని.. అందువల్లే భూమి కంపిస్తుందని అధికారులు చెబుతున్నారు.. అయితే వీటి తీవ్రత అధికంగా ఉంటే భూకంపం చోటు చేసుకుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.. కోల్ కతా ప్రాంతంలో భూకంపం వచ్చిన నేపథ్యంలో పరిశోధనలు జరుపుతున్నామని.. భూమి అంతర్గత పొరల్లలో కదలికలను గమనిస్తున్నామని శాస్త్రవేత్తలు అంటున్నారు.