Homeఅంతర్జాతీయంDhurandhar Movie Real Life Incident: చూస్తుండగానే ఉగ్రవాదిని లేపేసారు.. పాక్ లో దురంధర్ సినిమాను...

Dhurandhar Movie Real Life Incident: చూస్తుండగానే ఉగ్రవాదిని లేపేసారు.. పాక్ లో దురంధర్ సినిమాను లైవ్ లో చూపించారు!

Dhurandhar Movie Real Life Incident: దురంధర్ సినిమా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ సినిమాపై కొంతమంది విమర్శలు చేస్తుండగా.. మెజార్టీ ప్రజలు మాత్రం ఈ సినిమాను స్వాగతిస్తున్నారు. ఆదిత్య ధర్ అద్భుతంగా దర్శకత్వం వహించారని.. దేశభక్తిని మరో కోణంలో చూపించారని కొనియాడుతున్నారు. దురంధర్ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో.. పాకిస్తాన్లో ఒక సంచలన సంఘటన జరిగింది. పాకిస్తాన్ దేశంలో గుర్తుతెలియని వ్యక్తులు లష్కరే – ఏ – […]

Dhurandhar Movie Real Life Incident: దురంధర్ సినిమా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ సినిమాపై కొంతమంది విమర్శలు చేస్తుండగా.. మెజార్టీ ప్రజలు మాత్రం ఈ సినిమాను స్వాగతిస్తున్నారు. ఆదిత్య ధర్ అద్భుతంగా దర్శకత్వం వహించారని.. దేశభక్తిని మరో కోణంలో చూపించారని కొనియాడుతున్నారు.

దురంధర్ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో.. పాకిస్తాన్లో ఒక సంచలన సంఘటన జరిగింది. పాకిస్తాన్ దేశంలో గుర్తుతెలియని వ్యక్తులు లష్కరే – ఏ – తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ బిలాల్ అరీఫ్ సలాఫీని పాకిస్తాన్ దేశంలో అంతం చేశారు. మురిద్కే ప్రాంతంలోని మార్కెట్ తైబా ప్రాంతంలో ఈద్ ప్రార్ధన అనంతరం.. గుర్తు తెలియని వ్యక్తులు సలాఫీపై కాల్పులు జరిపారు.

ముఖానికి ముసుగు ధరించి వచ్చిన సాయుధులు.. సలాఫీపై దారుణంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కత్తితో పొడిచారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సలాఫీపై కాల్పులు.. కత్తితో దాడి చేసిన తర్వాత.. అక్కడ మొత్తం భయానక వాతావరణం ఏర్పడింది. సలాఫీని కాపాడేందుకు అక్కడి ప్రజలు ముందుకు వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈద్ కావడంతో ముస్లింలు అక్కడ ప్రార్థన చేయడానికి భారీగా వచ్చారు. అయితే సాయుధులు కాల్పులు జరిపిన నేపథ్యంలో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది . అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మురిద్కే ప్రాంతంలో వేర్పాటు వాదాన్ని రగిలించడంలో సలాఫీ ముఖ్యమంత్ర పోషించాడు. ఉగ్రవాద కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నాడు. వివిధ ప్రాంతాల నుంచి యువకులను తన ఉగ్రవాద సంస్థలో నియమించుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా వారందరినీ ప్రభావితం చేస్తున్నాడు. వేర్పాటు భావజాల బోధనలను వ్యాప్తి చేయడానికి అతడు యువకులకు శిక్షణ ఇస్తున్నాడు. మర్కజ్ తైబా ప్రాంతాన్ని శిక్షణ కేంద్రంగా ఉపయోగించుకుంటున్నాడు. అయితే అతనిపై దాడి చేసిన వారు వివరాలు.. ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితుల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ సంఘటన మొత్తం దురంధర్ సినిమాను లైవ్ లో చూపించింది . ఆ సినిమాలో కూడా రణ్ వీర్ సింగ్ ఉగ్రవాదులను ఏరి పారేస్తూ ఉంటాడు. వారిపై దాడులు చేస్తూ చంపేస్తూ ఉంటాడు. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా రియల్ దురంధర్ లు ఉన్నారని.. ఉగ్రవాదులను ఇలా చంపేస్తున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper