Dubai : ఆయన అతి పెద్ద మిలియనీర్. ఆయన ఉండేది దుబాయిలో. ఆయనకు చమురు వ్యాపారాలు ఉన్నాయి. ప్రపంచంలో పలు ప్రాంతాలలో షాపింగ్ కాంప్లెక్స్ లు ఉన్నాయి. ఆదాయపరంగా వేల కోట్లకు అధిపతి.. అతని పేరు జమాల్ ఆల్ నాదక్. అతని భార్య పేరు సౌదీ అల్ నదాక్. జమాల్ కు తన భార్య నదాక్ అంటే చాలా ఇష్టం. తన ప్రేమను వ్యక్తం చేయడానికి పలు సందర్భాల్లో ఆమెకు విలువైన కానుకలు అందించాడు.. బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, ప్లాటినం వంటి విలువైన లోహాలు అతడు అందించిన బహుమతుల జాబితాలో ఉన్నాయి. అయితే అవన్నీ ఇచ్చినప్పటికీ అతడిలో ఏదో వెలితి. పైగా విపరీతమైన డబ్బు ఉంది. దీంతో తన భార్యకు అద్భుతమైన కానుక ఇవ్వాలని భావించాడు. అది కూడా ఎవరూ ఊహించని విధమైన బహుమతి అందించాలని భావించాడు. ఏకంగా 50 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి అంటే మన కరెన్సీలో 418 కోట్లు వెచ్చించి హిందూ మహాసముద్రంలో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. అయితే దీని వెనుక ఆశ్చర్యకరమైన కారణం కూడా ఉంది.
అది వేసుకున్నప్పుడు ఇబ్బంది పడకూడదని..
సౌదీ అల్ నదాక్ దుబాయ్ లో ఉన్నప్పుడు సాంప్రదాయ బద్ధమైన దుస్తులు ధరిస్తుంటారు. విదేశాలకు వెళ్ళినప్పుడు పాశ్చాత్య దుస్తులు ధరిస్తుంటారు. ముఖ్యంగా ఆమెకు ఈతకొలను దుస్తులు వేసుకొని ఈదడం చాలా ఇష్టం. అయితే ఆ సందర్భంలో ఆమె అందాన్ని మరొకరు చూడటం జమాల్ అల్ నదాక్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. అందువల్లే ఆమె కోసం హిందూ మహాసముద్రంలో ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని సౌదీ అల్ నదాక్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా వెల్లడించింది. ” నాకు ఈత కలను దుస్తులు ధరించడం ఇష్టం. అయితే ఆ సమయంలో నేను ఇబ్బంది పడకూడదని నా భర్త ఒక దీపాన్ని నాకోసం కొనుగోలు చేశారు. భవిష్యత్తు కాలంలో పెట్టుబడి గురించి మేమిద్దరం చాలా విస్తృతంగా ఆలోచించాం. ఆ సమయంలో మా వ్యక్తిగత ముఖ్యతపై కూడా దృష్టి సారించాం.. నేను సముద్రం ఒడ్డున బీచ్ లో హాయిగా సేద తీరాలనేది నా భర్త కోరిక. ఆ తర్వాత రకరకాల చర్చలు జరిగిన అనంతరం నా భర్త ఒక ద్వీపాన్ని కొనుగోలు చేశాడు.. ఆ ద్వీపం ఆసియా ఖండంలో హిందూ మహాసముద్రంలో ఉందని” సౌదీ అల్ నదాక్ వ్యాఖ్యానించింది. ఈ వీడియో ఇప్పటికే మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ” అతడికి ఆ స్థాయిలో ధనం ఉంటే చార్టర్డ్ విమానం ఎందుకు కొనుగోలు చేయలేకపోయాడు? అసలు ఇలాంటి కోరికలు నెరవేర్చే భర్త ఎక్కడ దొరుకుతాడో” అంటూ వ్యాఖ్యలు చేశారు. సౌదీ అల్ నదాక్ చెప్పిన విషయాల ఆధారంగా ఆరా తీస్తే ఇంతవరకు ద్వీపం కొనుగోలు సంబంధించి అధికారిక ధ్రువీకరణ లేదని తెలుస్తోంది.