Devara Premier show Talk : దేవర’ ప్రీమియర్ షో టాక్ వచ్చేసింది..సినిమాలోని హైలైట్ సన్నివేశాలు ఇవే!

విడుదలకు ముందు ఎన్టీఆర్ స్టామినా చేయాల్సినవి మొత్తం చేసేసింది. ఇక టాక్ ఒక్కటే బ్యాలన్స్ ఉంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో కాసేపటి క్రితమే దుబాయి లో పూర్తి చేసుకుంది. ఈ షో నుండి వచ్చిన టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ట్రైలర్స్ లో చూసి అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగా ఇవ్వలేదని అందరూ అనుకున్నారు.

Written By: Vicky, Updated On : September 26, 2024 7:36 pm

Devara Premier show Talk

Follow us on

Devara Premier show Talk :  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ఏ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయో మన కళ్లారా చూసాము. మొదటి రోజు ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. కేవలం ఒక్క హైదరాబాద్ సిటీ నుండే ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. ఇక నార్త్ అమెరికా లో కేవలం ప్రీమియర్ షోస్ నుండే 3 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

ఇలా విడుదలకు ముందు ఎన్టీఆర్ స్టామినా చేయాల్సినవి మొత్తం చేసేసింది. ఇక టాక్ ఒక్కటే బ్యాలన్స్ ఉంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో కాసేపటి క్రితమే దుబాయి లో పూర్తి చేసుకుంది. ఈ షో నుండి వచ్చిన టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ట్రైలర్స్ లో చూసి అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగా ఇవ్వలేదని అందరూ అనుకున్నారు. కానీ సినిమాలో మాత్రం టైటిల్ కార్డ్స్ నుండే రోమాలు నిక్కపొడుచుకునే స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించాడట. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు జూనియర్ ఎన్టీఆర్ నటనకి పోటీ గా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందట. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరో ముగ్గురు కసిగా పనిచేస్తే ఎలాంటి ఔట్పుట్ వస్తుందో అలాంటి ఔట్పుట్ తో ఫస్ట్ హాఫ్ ఉంటుందట.

అయితే ఫస్ట్ హాఫ్ ప్రారంభం లో స్క్రీన్ ప్లే కాస్త నత్త నడకన సాగుతుందని టాక్. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఆరంభం స్లో గానే మొదలు అవుతుందట. కానీ కథ లో బలం ఉండడం వల్ల బోర్ కొట్టే ఫీలింగ్ చూసే ప్రేక్షకులకు రాదని తెలుస్తుంది. ఇక చివరి 30 నిమిషాలు వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాని ఇష్టపడే ప్రతీ ఒక్కరికి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుందట. ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని మరోసారి ఆడియన్స్ థియేటర్స్ లో అనుభూతి చెందుతారట. గ్రాఫిక్స్ కొన్ని సన్నివేశాల్లో బాగాలేవు కానీ, కొన్ని సన్నివేశాల్లో మాత్రం క్వాలిటీ అదిరిపోయిందని టాక్. ఇది ఇలా ఉండగా ట్రైలర్ లో చూపించిన షార్క్ ఫైట్ పెద్ద చర్చకు దారి తీసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ పోరాట సన్నివేశం ఎలా ఉంటుందో అని ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా కాస్త కంగారు ఉండేది. కానీ వెండితెర మీద చూసినప్పుడు మాత్రం ఈ సన్నివేశం అదిరిపోతుందట. ముఖ్యంగా ప్రేక్షకులు ఐమాక్స్, 4Dx ఫార్మటు ఉన్న థియేటర్స్ లో ఈ సినిమాని చూస్తే అద్భుతమైన అనుభూతి కలుగుతుందని అంటున్నారు. మరి దుబాయి ప్రీమియర్ షో లో వచ్చిన ఈ టాక్ ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.