Lok Sabha Election 2024: మా దేశం.. మా ఎన్నికలు.. మీకేంటి నొప్పి..

జమ్మూ కశ్మీర్‌పై అసంమజసమైన వాదనలతో భారత్‌ నేతలు రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. వాటిని గమనిస్తున్నాం. ఇటువంటి వాటిని తిరస్కరిస్తున్నాం. ఉద్రేకపూరిత వ్యాఖ్యలు ప్రాంతీయ శాంతికి ముప్పు లిగిస్తాయి అని పేర్కొంది.

Written By: Raj Shekar, Updated On : April 27, 2024 10:35 am

Lok Sabha Election 2024

Follow us on

Lok Sabha Election 2024: భారత పార్లమెంటు ఎన్నికల వేళ.. మన దాయాది దేశం పాకిస్థాన్‌ మరోసారి ఓర్వలేనితనం ప్రదర్శించింది. తన అక్కసును వెల్లగక్కింది. మన దేశంలో ఎన్నికలు జరుగుతుంటే.. వాళ్ల దేశానికి ఏదో ఐపోతున్నట్లు భావిస్తోంది. ఎన్నికల ప్రచారంలో మన నేతలు పాకిస్థాన్‌ను ఉదహరించడాన్ని తట్టుకోలేకపోతోంది. ఇక మన కశ్మీర్‌ గురించి మాట్లాడినా.. అక్కడి నేతలకు నొప్పి పుడుతోంది. మన నేతల ప్రసంగాల్లోకి పాకిస్థాన్‌ను లాగొద్దని, జమ్మూ కశ్మీర్‌పై నాయకులు చేస్తున్న వాదనలను తిరస్కరిస్తున్నామని విదేశాంగ శాఖ వీకెండ్‌ మీటింగ్‌లో వ్యాఖ్యానించింది.

ఏమంది అంటే..
జమ్మూ కశ్మీర్‌పై అసంమజసమైన వాదనలతో భారత్‌ నేతలు రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. వాటిని గమనిస్తున్నాం. ఇటువంటి వాటిని తిరస్కరిస్తున్నాం. ఉద్రేకపూరిత వ్యాఖ్యలు ప్రాంతీయ శాంతికి ముప్పు లిగిస్తాయి అని పేర్కొంది. ఎన్నికల వేళ తమ బహిరంగ ప్రసంగాల్లో పాకిస్థాన్‌ను ముద్దాయిగా చూపే పద్ధతి మంచిది కాదు. అని విదేశాంగ శాఖ కార్యాలయం అధికార ప్రతినిధి ముంతాజ్‌ జరా బలూచ్‌ వ్యాఖ్యానించారు. భారత్‌ నిరాధార వాదనలు చేస్తోందన్నారు.

తిప్పికొట్టిన భారత్‌..
మన నేతల ఎన్నికల ప్రసంగాలపై పాకిస్థాన్‌ జోక్యం చేసుకోవడాన్ని, మన నేతల వ్యాఖ్యలను తప్పు పట్టడాన్ని భారత్‌ తిప్ప కొట్టింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాక్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని ఉద్ఘాటించింది. ఈ విషయంలో మాట్లాడటానికి ఏ దేశానికీ అధికారం లేదని స్పష్టం చేసింది.

మీకుంటది సామీ..
ఇప్పటికే భారత్‌ తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్‌ ప్రజలు గోధుమ పిండి కూడా అడుక్కు తింటున్నారు. తమ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడి పరిస్థితులను సరిదిద్దుకోవడం పక్కన పెట్టి.. మన దేశంపై పడడం చర్చనీయాంశమైంది. మళ్లీ మోదీ ప్రధాని అయితే.. ఈసారి పాకిస్థాన్‌ అడ్డుక్కు తినే పరిస్థితి కూడా ఉండకుండా చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.