https://oktelugu.com/

Star Heroine: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా..?

కొత్త బంగారులోకం సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తను ఇప్పటికీ చాలా స్పెషల్ గా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆమె ఆ సినిమాలో నటించిన నటన అలా ఉంటుంది.

Written By:
  • Gopi
  • , Updated On : April 27, 2024 / 10:33 AM IST

    Do you know how the former star heroine is now

    Follow us on

    Star Heroine: కొత్త బంగారులోకం సినిమాతో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ ‘శ్వేతా బసు ప్రసాద్’…ఈ సినిమా ఒక సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇక లవ్ స్టోరీ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆ సంవత్సరం రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఆమె అడపదడప కొన్ని సినిమాల్లో నటించినప్పటికి ఆమెకు ఆశించిన విజయాలు మాత్రం దక్కలేదు.

    ఇక దానికి తగ్గట్టుగానే ఆమె కొన్ని కేసుల్లో కూడా ఇరుక్కొని కెరియర్ మొత్తాన్ని నాశనం చేసుకుంది. ఇక మొత్తానికైతే కొత్త బంగారులోకం సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తను ఇప్పటికీ చాలా స్పెషల్ గా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆమె ఆ సినిమాలో నటించిన నటన అలా ఉంటుంది. ఇక తను కెరియర్ ని కోల్పోయిన తర్వాత 2018 వ సంవత్సరంలో తన లవర్ అయిన రోహిత్ మిట్టల్ ను పెళ్లి చేసుకుంది.

    ఇక వీళ్ళ మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో వీళ్ళ బంధం ఎక్కువ కాలం నిలువలేకపోయింది. అందువల్లే వీళ్లిద్దరూ విడిపోయారు. ఇక ప్రస్తుతం సింగిల్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్న శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడు ఓటిటి లో కొన్ని వెబ్ సిరీస్ లను చేస్తూ తన లైఫ్ మళ్లీ బిజీగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక అందులో భాగంగానే సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. తనకు తగ్గ మంచి పాత్ర దొరికితే సినిమాల్లో కూడా రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది.

    ఇక ఇప్పుడు ఆమె రిలీజ్ చేయబోతున్న ఓటిటి సినిమాలు కనుక సూపర్ సక్సెస్ ని సాధిస్తే మళ్లీ తను స్టార్ నటి గా కొనసాగాలనే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇప్పుడు చాలామంది హీరోయిన్లు రీ ఎంట్రీ ఇస్తున్న సమయంలో శ్వేత బసు కూడా రీ ఎంట్రీ ఇవ్వడం అనేది ఆమె అభిమానులకి మంచి ఆనందాన్ని ఇస్తుందనే చెప్పాలి…