US withdrawing from WHO: ప్రపంచ పీస్ కమిటీ ఏర్పాటు చేసిన కొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో నుంచి అధికారికంగా వైదొలింది. కొవిడ్‌ను నియంత్రణ, సంస్కరణల్లో వైఫల్యం కారణంగానే అమెరికా వైదొలిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. డబ్ల్యూహెచ్‌వోకు అందే నిధులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్త కార్యాలయాల నుంచి అమెరికన్ సిబ్బందిని ఉపసంహరిస్తున్నామని ప్రకటించారు. సాంకేతిక సమితులు, పని బృందాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించింది.
పరిమిత సహకారం..
రెండో మారు అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గతంలోనే డబ్ల్యూహెచ్‌వో అవసరం లేదని హెచ్చరించారు. ఇప్పుడు ఆ నిర్ణయం అమలులోకి వచ్చింది. భవిష్యత్తులో పరిమిత రేంజ్‌లో మాత్రమే సంస్థతో పనిచేస్తామని అమెరికా ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో కొత్త మలుపు తిప్పనుంది.
అమెరికా వైదొలిగే సమయానికి అమెరికాకు డబ్ల్యూహెచ్‌వోకు 260 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,382 కోట్లు) డెడ్ అవుతుందని బ్లూమ్‌బర్గ్ నివేదికలు తెలిపాయి. ఈ చర్య ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాలపై ప్రభావం చూపనుంది. అమెరికా స్వతంత్ర ఆరోగ్య విధానాలకు దొరికిన అవకాశంగా విశ్లేషకులు చూస్తున్నారు.