Donald Trump
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికాలో 5 లక్షల మందికి నివాస హోదా రద్దు చేస్తూ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(DHS) ప్రకటించింది. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా నుంచి వచ్చిన సుమారు 5,32,000 మంది వలసదారుల నివాస హోదా నెల రోజుల్లో రద‍్దవుతుంది. వీరంతా 2022 అక్టోబర్ నుంచి అమెరికాలో ఉంటున్నట్లు గుర్తించారు. బైడెన్ పరిపాలన కాలంలో అమలు చేసిన “హ్యూమానిటేరియన్ పరోల్” పథకం కింద రెండేళ్ల నివాస, పని అనుమతులతో ఉన్నారు. తాజా రద్దు ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వస్తుందని డీహెచ్‌ఎస్ స్పష్టం చేసింది. ఫెడరల్ రిజిస్టర్‌లో నోటిఫికేషన్ ప్రచురితమైన 30 రోజుల తర్వాత అమలు జరుగుతుందని సమాచారం. ఈ చర్యను ట్రంప్ పరిపాలన “హ్యూమానిటేరియన్ పరోల్ యొక్క దుర్వినియోగాన్ని” అరికట్టే ఉద్దేశంతో తీసుకుందని చెబుతోంది.
Also Read : అమెరికా విద్యాశాఖను ట్రంప్ ఎందుకు రద్దు చేశాడు? కారణాలు ఏమిటి?
గతంలో ఇలా..
“హ్యూమానిటేరియన్ పరోల్ పథకం గతంలో యుద్ధం లేదా రాజకీయ అస్థిరతలు ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి తాత్కాలిక నివాసం కల్పించడానికి ఉపయోగపడింది. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసలను గట్టిగా అడ్డుకుంటామని, పెద్ద ఎత్తున గడిపారు చేస్తామని హామీ ఇచ్చారు, ఈ నిర్ణయం ఆ దిశలో ఒక అడుగుగా చూడవచ్చు. పథకం రద్దుతో క్యూబా, వెనిజులా, నికరాగ్వా దేశాలు డిపోర్టేషన్‌లను సాధారణంగా అంగీకరించని నేపథ్యంలో, అమలు సవాళ్లు ఉండవచ్చు. హైతీ మాత్రం గతంలో డిపోర్టేషన్ విమానాలను అనుమతించింది, కానీ అక్కడి అస్థిరత వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే, ఈ ఆదేశానికి వ్యతిరేకంగా అమెరికన్ పౌరులు, వలసదారులు సంయుక్తంగా ఫెడరల్ కోర్టుల్లో దావా వేశారని, ఈ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారని సమాచారం.
Also Read : హెచ్–1బీ వీసా నిబంధనల్లో మార్పు.. ఆ రికార్డులు తొలగింపు!