Donald Trump Social Media Post : అమెరికా అధ్యక్షుడు Donald Trump రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. కొన్ని ముఖ్యమైన సందేశాలను కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటాడు. అయితే ఆయన చేసే కొన్ని పోస్టులు ఆసక్తికరంగా ఉంటే.. మరికొన్ని పోస్టులు విమర్శనాత్మకంగా ఉంటాయి. భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం జరిగిన సమయంలో ఇరుదేశాలను తాను ఒప్పించి యుద్ధం ఆపించానని ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. దీంతో ప్రపంచానికి ఈ విషయం జెట్ స్పీడ్ లా వెళ్లిపోయింది. ఇలా ముఖ్యమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలపడంపై కొందరు ప్రశంసించారు. కానీ లేటెస్ట్ గా ఆయన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు పై విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ అమెరికా అధ్యక్షుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టాడు? ఆ పోస్ట్ పై ఇలాంటి విమర్శలు వస్తున్నాయి?
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలకు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యారు. అయితే రెండోసారి బాధ్యతలు చేపట్టిన అప్పటినుంచి ఆయన ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్స్పెక్ట్ చేయని పనులు చేస్తున్నారు. ఒక రకంగా తాను తీరిక లేకుండా పని చేస్తున్నాడని ఇతరులు చెప్పడం కాదు.. తనకు తానే చెప్పుకుంటూ ఉన్నాడు. తనకు వచ్చే జీతాన్ని కూడా త్యాగం చేస్తున్నానని కొన్ని సందర్భాల్లో పేర్కొన్నాడు. ట్రంప్ కు మూలవేతనం 4 లక్షల డాలర్లు ఉంటుంది. అమెరికా ఫెడరల్ చట్టం ద్వారా అదనంగా అతనికి 1,69,000 డాలర్లను ఇస్తారు. అయితే తనకు వచ్చే ఈ ఆదాయంలో ఎక్కువగా విరాళం ఇస్తున్నట్లు చెప్పాడు. 2025 లో తనకు వచ్చిన మొదటి జీతం వైట్ హౌస్ పునరుద్ధరణకు వైట్ హౌస్ హిస్టారికల్ అసోసియేషన్కు ఇచ్చినట్లు ప్రకటన వెలువడింది.
అయితే క్రిప్టో కరెన్సీ, గోల్ఫ్ క్లబ్ వంటి తన సొంత ఆస్తుల నుంచి 1.6 బిలియన్లకు పైగా ఆదాయం వస్తుంది. వీటిని కూడా దానధర్మాలు చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలుపుతున్నారు. ఇలా డబ్బు కోసం కాకుండా దేశం కోసం తీరిక లేకుండా పనిచేస్తున్నారని.. కొందరు అంటున్నారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ “డోనాల్డ్ ట్రంప్ దేశాన్ని కాపాడడం కోసం కుక్కలా పనిచేస్తున్నాడు.. అయినా ఆయన త్యాగాన్ని దేశం గుర్తించట్లేదు”అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్టును ట్రంప్ ట్రూత్ సోషల్ అకౌంటుకు షేర్ చేశాడు. అయితే తన సోషల్ మీడియా ఖాతాకు ఈ పోస్ట్ షేర్ చేయడంతో ట్రంప్ స్పందించారు. ఈ పోస్ట్ కు ప్రతిస్పందనగా “థాంక్స్.. అమెరికా గొప్ప పురోగతి సాధిస్తుంది”అని రిప్లై ఇచ్చాడు. అయితే కొందరు ఈ పోస్టుపై విమర్శలు చేస్తున్నారు. ట్రంప్ తనకు తానే లవ్ లెటర్ రాసుకున్నారు అని వ్యంగంగా విమర్శిస్తున్నారు. అయితే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు.