Donald Trump Inauguration : అగ్రరాజ్యాధినేతగా రిపబ్లికన్ పార్టీ(Republican Party) నేత డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. జనవరి 20న ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. వాషింగ్టన్లో ఎముకలు కొరికే చలి ఉన్న నేపథ్యంలో ప్రమాణస్వీకారోత్సవాన్ని అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోని రోటుండా సముదాయంలో నిర్వహించేందుకు ఏర్పాట్లుల చేస్తున్నారు. సాధారణంగా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని క్యాపిటల్ భవనంలో జాతీయ చిహ్నాల ఎదుట నిర్వహించేవారు. వేలాది మంది ప్రజానీకం సాక్షిగా ఈ ఘట్టం జరిగేది. ప్రస్తుతం చలి తీవ్రత నేపథ్యంలో క్యాపిటల్ భవనం లోపల ఉండే రోటుండా హాల్(Rotunda Hall)లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ట్రంప్ ప్రమాణ వేడుక తిలకిచేందుకు చలిని లెక్క చేయకుండా దేశం నలుమూలల నుంచి ప్రజలు వాషింగ్టన్కు చేరుకుంటున్నారు. నగరంలోని ఖరీదైన హోటళ్లలో బస చేస్తున్నారు. ఇదే అదనుగా హోటళ్ల నిర్వాహకులు చార్జీలు నాలుగు రెట్లు పెంచేశారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం రోజున వాషింగ్టన్ డీసీలో ఉష్ణోగ్రతలు సగటున మైనస్ 11 డిగ్రీల సెల్సీయస్ వరకు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ట్రంప్ ప్రకటన..
ఇక తన ప్రమాణ స్వీకార కార్యక్రమంపై కాబోకే అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. క్యాపిటల్ భవనంలోని రోటుండా సముదాయంలో కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆర్కిటిక్ ప్రాంతంవైపు నుంచి వాషింగ్టన్ దిశగా బలమైన చలిగాలులు వీస్తున్నదున వేదికను మార్చినట్లు పేర్కొన్నారు. తన ప్రమాణ స్వీకరానికి వేలాది మంది చలిలో ఇబ్బంది పడుతూ రావాలని కోరుకోవడం లేదని తెలిపారు. వాతావరణం సరిగా లేనందున ఇబ్బంది పడుతూ రావొద్దని కోరారు.
1985లో రోటుండా హాల్లో..
క్యాపిట్ భవనంలోని రోటుండా హాల్లో చివరిసారి 1985 జనవరి 20 అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరిగింది. అప్పట్లో మైనస్ 14 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఇక్కడే ఏర్పాట్లు చేశారు. మళ్లీ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో కనీ వినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో 30 మైళ్ల వరకు తాత్కాలిక కంచెను ఏర్పాటు చేశారు. 25 వేల భద్రతా సిబ్బందిని మోహరించారు. ప్రత్యేక అతిథులు, ఆహ్వానితులను మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఇక సీక్రెట్ ఏజెంట్లు కూడా తమ పని మొదలు పెట్టారు. కార్యక్రమానికి అంతరాయం కలిగించే చర్యలను, నిరసనలను ముందస్తుగా గుర్తించే పనిలో ఉన్నారు.
నిరసన తెలిపిన వారికీ అనుమతి
2020 అధ్యక్ష ఎన్నికలోల ట్రంప్ ఓడిపోయారు. అప్పట్లో చాలా మంది ఆయన మద్దతు దారులు వాషింగ్టన్ క్యాపిట్ భవనం వద్ద ఆందోళన చేశారు. భవనంలోకి చొరబడ్డారు. దీంతో వారిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడ ట్రంప్ మళ్లీ గెలిచారు. దీంతో నాడు నిరసన తెలిపినవారిని తన ప్రమాణస్వీకారానికి ట్రంప్ ఆహ్వానించారు. కోర్టు కూడా వారికి అనుమతి ఇచ్చింది.