Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు పేపట్టనున్న ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. ఇరు దేశాల బంధం మరింత బలపడాలని కాంక్షించారు. మోదీ, ట్రంప్ ఇద్దరూ మంచి మిత్రులు. 2016 నుంచి 2020 వరకు ఇరు దేశాల మధ్య బంధం పలపడేందుకు కృషి చేశారు. ట్రంప్ అమెరికాలో హౌడీ–మోడీ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఇక మోదీ కూడా గుజరాత్‌లో నమస్తే ట్రంప్ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. తాజాగా ట్రంప్ మరోమారు అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఫలితం వచ్చి వెంటనే మోదీ ఫోచేశారు. ఈ సందర్భంగా ట్రంప్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మోదీని ప్రేమిస్తోందని ప్రశంసించారు. భారత్ అద్భుత దేశమని కితాబిచ్చారు. మోదీద తనకు నిజమైన స్నేహితుడు అని పేర్కొన్నారు.
79 ఏళ్ల వయసులో.. 47వ అధ్యక్షుడిగా..
ఇదిలా ఉంటే ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రిపబ్లికన్ పారీ తరఫున పోటీ చేసిన ఆయన అధికార డమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై విజయం సాధించారు. 79 ఏళ్ల వయసులో అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు అయ్యారు. హోరాహోరీ పోరు ఉంటుందనుకుంటే.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఏకపక్ష విజయం సాధించారు. గెలుపు ఓటములను నిర్ణయించే స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ క్లీన్ స్వీప్ చేశారు. దీంతో భారీ మెజారిటీ సాధ్యమైంది.