https://oktelugu.com/

YS Jagan : డ్యామేజ్ చేసిన వారికే ఛాన్స్ ఇస్తున్న జగన్!

రాజకీయంగా కొన్ని అంశాలను గుణపాఠాలుగా తీసుకోవాలి. ముఖ్యంగా ఓటమి ఎదురైనప్పుడు అందుకు కారణాలను విశ్లేషించాలి. వాటి నుంచి అధిగమించే ప్రయత్నం చేయాలి. కానీ ఈ విషయంలో వైసీపీ అధినేత విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : November 7, 2024 / 12:48 PM IST

    YS jagan

    Follow us on

    YS Jagan :  రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తలు అన్నది సర్వసాధారణంగా మారింది. అయితే ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాతే ఈ పరిస్థితి ఎక్కువైంది.దేశంలోని అన్ని పార్టీలకు తన విశేష సేవలు అందించారు ప్రశాంత్ కిషోర్.2019లో ఏపీలో వైసీపీ అధినేత జగన్ కోసం పనిచేశారు.ఆ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకుతన శక్తి యుక్తులను ప్రదర్శించారు. ఈ ఎన్నికల్లో మాత్రం జగన్ ఓడిపోతారని తేల్చి చెప్పారు.ప్రశాంత్ కిషోర్ జోష్యం చెప్పినట్లే అయింది. అయితే గత ఐదేళ్లుగా ప్రశాంత్ కిషోర్ పూర్వాశ్రమం అయిన ఐ పాక్ వైసీపీకి సేవలు అందించింది. అయినా సరే ఆ పార్టీ ఓటమి చవిచూసింది. దీంతో ఐపాక్ టీం పై ముప్పేట విమర్శలు వచ్చాయి. సొంత పార్టీ నేతలే వైసిపి టీం నుతప్పు పట్టారు.ఇప్పుడు అదే టీంమరోసారి వైసీపీకి సేవలందించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే చిన్న చిన్న పనులు చేస్తున్న ఐపాక్ టీం పూర్తిస్థాయి సేవలందించనుంది.అయితే ఈసారి రుషిరాజ్ సింగ్ నేతృత్వంలో ఐప్యాక్ నడుస్తుందా? లేదా? అన్నది చూడాలి.

    * ఐ పాక్ టీమ్ ను నమ్మిన జగన్
    గత ఐదు సంవత్సరాలుగా వైసీపీకి ఐప్యాక్ టీం వెన్నుదన్నుగా నిలిచింది. 2019 ఎన్నికల్లో తన విజయానికి ఐపాక్ కారణమని జగన్ బలంగా నమ్మారు. అందుకే ఆ విభాగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. చివరకు వారి సిఫారసుల మేరకే అభివృద్ధి పనులు కూడా మంజూరు చేశారన్న విమర్శలను ఎదుర్కొన్నారు జగన్. అప్పట్లో ప్రతి ఎమ్మెల్యే, మంత్రులపై ఐపాక్ టీం నిఘా ఉండేది. దీనిపై చాలా రకాల విమర్శలు వచ్చాయి. అయినా సరే జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అదే ఐప్యాక్ టీంకుఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. వారి సలహాలను పాటించారు. వారిచ్చిన సూచన మేరకు వలంటీర్ వ్యవస్థను తెరపైకి తెచ్చారు. అయినా సరే ఐపాక్ టీం వ్యూహాలు ఎన్నికల్లో పనిచేయలేదు. దీంతో ఎన్నికల ఫలితాలు తర్వాత చాప చుట్టేసింది ఆ టీం. ఇప్పుడు అదే టీంను తెప్పించారు జగన్. ఒకటి రెండు రోజుల్లో ఏపీలో ఎంటర్ కానుంది ఐపాక్ బృందం.

    * వైసీపీ శ్రేణుల్లో ఆందోళన
    అయితే ఇప్పటికీ అధినేత జగన్ తీరు మారకపోవడంతో వైసిపి శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి.చాలామంది పార్టీకి గుడ్ బై చెప్పారు కూడా. అయినా సరే జగన్ తీరు మారలేదు. ఎన్నికల్లో నష్టానికి గురిచేసిన రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థను మళ్ళీ తెరపైకి తెచ్చారు. తన సామాజిక వర్గానికి చెందిన ఆ నలుగురికి మాత్రమే బాధ్యతలు అప్పగించారు. సమర్ధులైన నేతలను పక్కన పెట్టారు. సోషల్ మీడియా విభాగం నుంచి సజ్జల భార్గవరెడ్డిని తప్పించారు. ఇప్పుడు ఐపాక్ టీమ్ ను తిరిగి రప్పిస్తున్నారు. దీంతో ఫెయిల్యూర్ అంశాలనే తెరపైకి తెస్తుండడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అధినేత తీరుపై ఎక్కువ మంది ఆక్షేపిస్తున్నారు.