Donald Trump Iran War Statement: పశ్చిమ యుద్ధం తీవ్రంగాలుస్తుంది. ఒకవైపు చర్చలు జరుపుతున్నామంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాడులను తీవ్రతరం చేశారు. తాజాగా రెండు మూడు వారాలు యుద్ధాన్ని ముగిస్తామని ప్రకటించారు. ఈ లోగా ఇరాన్ డీల్ కుదుర్చుకోకుంటే భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ అణు ఒప్పందానికి అంగీకరించకపోతే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: అట్లాంటాలో ‘తానా’ సి.పి.ఆర్ శిక్షణ కార్యక్రమం విజయవంతం
ఇప్పటికే సైనిక శక్తి ధ్వంసం..
యుద్ధం మొదలై నెల రోజులు దాటిన ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్ తోపాటు అమెరికాకు మద్దతు ఇస్తున్న గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. కానీ ట్రంప్ తాజాగా ఇరాన్‌పై ఇప్పటికే చేసిన దాడుల్లో నౌకాదళం, వాయుసేన పూర్తిగా నాశనం అయ్యాయని పేర్కొన్నారు. ఇరాన్‌లోని ఏడు వేలకుపైగా లక్ష్యాలపై దాడులు జరిగాయని, వాణిజ్య, సైనిక కేంద్రాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడి, ఒక కాలు కోల్పోయారని వార్తలు వచ్చాయని పేర్కొన్నారు. టెహ్రాన్, ఇస్ఫహాన్ సహా కీలక నగరాల్లో 30 ప్రాంతాలపై క్షిపణి దాడులు జరిగాయి వెల్లడించారు. చరిత్రలో ఏ దేశమూ దెబ్బతిననంత తీవ్రంగా ఇరాన్ ను దెబ్బ తీశామని ప్రకటించారు. 47 సంవత్సరాలుగా ఇరాన్ ప్రపంచానికి కలిగిస్తున్న నష్టానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోబోతోంది హెచ్చరించారు.
ఇరాన్ ఇంధనం అవసరంలేదు..
ట్రంప్ తన ప్రకటనలో కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. హార్మూజ్ జలసంధి గుండా మాకు ఇరాన్ ఇంధనం అవసరంలేదు అని స్పష్టం చేశారు. ఇతర దేశాలు కావాలంటే ఆ మార్గం గుండా వెళ్లి నూనె తెచ్చుకోవచ్చు, లేదా అమెరికా నుంచే కొనుగోలు చేయాలని ఉచిత సలహా ఇచ్చారు. ఈ వ్యాఖ్య ఇరాన్‌కు భారీ ఆర్థిక దెబ్బ – ఎందుకంటే ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ జలసంధి గుండానే వెళ్తుంది. తాజాగా టోల్ వసూలు చేయాలని నిర్ణయించింది. భీకర దాడులకు ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తే ప్రపంచ చమురు ధరలు ఆకాశాన్నంటుతాయని, కానీ అమెరికా షేల్ గ్యాస్ విప్లవం వల్ల ఇప్పుడు స్వయంసమృద్ధిగా మారిందని ట్రంప్ సంకేతం ఇచ్చారు.
డీల్ కుదరకపోతే విద్యుత్ కేంద్రాల ధ్వంసం..
ట్రంప్ ఇరాన్‌కు తాజాగా ఇచ్చిన స్పష్టమైన అల్టిమేటంలో ఇరాన్ అణు ఒప్పందానికి (న్యూక్లియర్ డీల్) అంగీకరించాలన్నారు. అంగీకరించకపోతే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను (ఎలక్ట్రిక్ జనరేటింగ్ ప్లాంట్స్) లక్ష్యంగా దాడులు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే చిన్నా చితకా లక్ష్యాలు మాత్రమే మిగిలాయి, వాటిని కూడా త్వరలోనే ధ్వంసం చేస్తామని చెప్పారు. ఈ హెచ్చరిక ఇరాన్‌కు అత్యంత కఠినమైనది. ఎందుకంటే విద్యుత్ కేంద్రాల ధ్వంసం అంటే దేశం మొత్తం అంధకారం అవుతుంది.
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ యుద్ధం విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు తలెత్తాయి.ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేస్తోంది, కానీ అమెరికా మాత్రం త్వరగా నిష్క్రమించాలని భావిస్తోంది. ఈ విషయంలో అమెరికాతో ఇజ్రాయెల్ విభేదిస్తోంది. మరోవైపు యూరోపియన్ యూనియన్ ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. స్పెయిన్త న నావల్, ఎయిర్ బేస్‌లు ఇవ్వడానికి నిరాకరించి, ఎయిర్ స్పేస్‌ను మూసివేసింది. పాకిస్తాన్ మౌనంగా ఉండి, అమెరికాకు ఎయిర్ బేస్‌లు అందించిందని ఇరాన్ ఆరోపించింది. సౌదీ అరేబియా ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా కూటమికి మద్దతు ఇస్తోంది.
ఇరాన్ కు రెండే ఆప్షన్లు..
తాజా అల్టిమేటం నేపథ్యంలో ఇరాన్ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి అణు ఒప్పందానికి అంగీకరించడం. అంటే యురేనియం సమృద్ధిని పరిమితం చేసుకోవడం, అంతర్జాతీయ పర్యవేక్షణకు లోబడటం. రెండోది విద్యుత్ కేంద్రాల ధ్వంసాన్ని ఎదుర్కోవడం.. అంటే దేశం మొత్తం చీకటిమయం కావడం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం.
ట్రంప్ వ్యూహం స్పష్టం చేశారు. ఇరాన్‌ను ఆర్థికంగా, సైనికంగా పూర్తిగా బలహీనపరిచి, ఒప్పందానికి బలవంతం చేయడం. రెండు మూడు వారాల్లో భీకర దాడులు చేస్తామని హెచ్చరించడం వల్ల ఇరాన్‌పై మానసిక ఒత్తిడి పెంచింది. ఇరాన్ లొంగిపోతుందా? లేదా చివరి వరకూ పోరాడుతుందా? అనేది వచ్చే రెండు వారాల్లో తేలనుంది.
