Homeఅంతర్జాతీయంTrump controversial comments: ట్రంప్ కు చిప్ దొబ్బిందా.. ఏంటి మాటలు

Trump controversial comments: ట్రంప్ కు చిప్ దొబ్బిందా.. ఏంటి మాటలు

Trump controversial comments: పశ్చిమాసియాలో యుద్ధం మొదలు పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప అంచనాలు తలకిందులయ్యాయి. నల్లేరుపై నడక అనుకున్న యుద్ధం.. ఇప్పుడు పల్లేరు ముళ్లై గుచ్చుతోంది. దీంతో ట్రంప్‌ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ఇరాన్‌ చేస్తున్న ప్రతీకార దాడులతో అమెరికా అతలాకులతం అవుతోంది. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. దీంతో అగ్రరజ్యాంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈపరిస్థితిలో యుద్ధం ఎలా ముగించాలో ట్రంప్‌కు అంతుచిక్కడ లేదు. మరోవైపు రోజుకో తీరుగా యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. దీంతో ట్రంప్‌కు అసలు ఏమైంది అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘హర్మూజ్‌ జలసంధిని కంట్రోల్‌ చేయడం మాకో లెక్క కాదు, రెండు నిమిషాల పని‘ అని ఆరు రోజుల క్రితం డొనాల్డ్‌ ట్రంప్‌ గర్వంగా ప్రకటించారు. కానీ ఇప్పుడేమో మంగళవారం లోపు దాన్ని తెరవాలని ఇరాన్‌కు వార్నింగ్‌ ఇస్తూ, చిల్లర భాషతో మాట్లాడారు. ఈ వైరుధ్యం చూసి నెటిజన్లు ‘ట్రంప్‌ మెదడు పనిచేస్తోందా?‘ అని ఫైరవుతున్నారు.

అగ్రరాజ్యాధ్యక్షుడి హోదా పరువు తీస్తున్నాడు..
ట్రంప్‌ ఇరాన్‌ను ఉద్దేశించి బా*ర్డ్స్ (Bastards) అని చిల్లర భాష మాట్లాడారు. ప్రపంచ అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడు, యుద్ధ సమయంలో ఇలాంటి భాష వాడటం సరైందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు శాంతి చర్చల గురించి మాట్లాడుతూ, మరోవైపు దూషిస్తూ మాట్లాడటం ట్రంప్‌ ద్వంద్వ నైజాన్ని చాటుతోంది. అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం అంతర్జాతీయంగా అవమానకరం. సైనికులు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుంటే, అధ్యక్షుడు చిల్లర భాష మాట్లాడటం వారి మనోబలాన్ని దెబ్బతీస్తుంది.

‘మెదడు పనిచేస్తోందా?‘
సోషల్‌ మీడియాలో ట్రంప్‌ పై విమర్శల వర్షం కురుస్తోంది.. యుద్ధం ఎలా ముగించాలో తెలియక ఇలా మాట్లాడుతున్నారని కొందరు. వైరుధ్యమైన ప్రకటనలు చేస్తూ అధ్యక్షుడి హోదాను దిగజార్చారని మరికొందరు.. పిచ్చివాడి చేతిలో అణుబాంబు ఉన్నట్లు ఉందని హాస్యంగా, కానీ ఆందోళనతో కామెంట్స్‌ చేస్తున్నారు. గంభీరమైన యుద్ధ సమయంలో ఇలాంటి ప్రవర్తన సరైందా అని ప్రశ్నిస్తున్నారు.

యుద్ధంపై అయోమయం
ట్రంప్‌ ప్రవర్తన వెనుక ఉన్న నిజం ఒక్కటే..యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియని అయోమయం. ఇప్పటికే 22 యుద్ధ విమానాలు కూలిపోయాయి, సైనికులు పట్టుబడ్డారు, భూసేనల మోహరింపు చిక్కుల్లో పడింది. చర్చలకు ఇరాన్‌ కఠిన షరతులు పెట్టింది, పాకిస్తాన్, గల్ఫ్‌ దేశాల మధ్యవర్తిత్వం విఫలమైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారం పెరుగుతోంది. ఈ ఒత్తిళ్ల మధ్య ట్రంప్‌ మానసిక స్థైర్యం కోల్పోయినట్లు కనిపిస్తోంది. ప్రగల్భాలు పలికి, ఇప్పుడు బెదిరింపులకు దిగజారుతున్నారు.

అమెరికా ప్రతిష్టకు మచ్చ
ట్రంప్‌ ప్రవర్తన అమెరికా ప్రతిష్టకు మచ్చ తెచ్చిపెట్టింది. అధ్యక్షుడికే యుద్ధం ఎలా ముగించాలో తెలియకపోతే, సైనికులు, ప్రజలు ఏం చేయాలి? ట్రంప్‌ మాటలు విని ఇతర దేశాలు అమెరికాపై నమ్మకం కోల్పోతున్నాయి. యుద్ధం ముగియకముందే, ట్రంప్‌ రాజకీయ యుద్ధం ముగిసినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version