Homeఅంతర్జాతీయంJoe Biden: అమెరికా అధ్యక్ష భవనంలో దీపావళి.. కీలక వ్యాఖ్యలు చేసిన బైడెన్‌.. కమలా హారిస్‌పై...

Joe Biden: అమెరికా అధ్యక్ష భవనంలో దీపావళి.. కీలక వ్యాఖ్యలు చేసిన బైడెన్‌.. కమలా హారిస్‌పై ప్రశంసలు!

Joe Biden: దీపావళి పండుగ సందడి ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది. ఈ ఏడాది అక్టోబర్‌ 31, నవంబర్‌ 1వ తేదీల్లో పండుగ జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. నరకాసురుని వధకు చిహ్నంగా భారతీయులు దీపావళిని జరుపుకుంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు కూడా ఈ పండుగను ఏటా జరుపుకుంటున్నారు. దీంతో విదేశాల్లోనూ మన పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నారు. తాజాగా అమెరికా అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఇందులో అధ్యక్షుడు జో బైడెన్‌తోపాటు కాంగ్రెస్‌నాయకులు, అధికారులతోపాటు 600 మంది భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దక్షిణాసియా అమెరికన్‌ సమాజాన్ని బైడెన్‌ కొనియాడారు. ‘అధ్యక్షడి హోదాలో వైట్‌హౌస్‌లో అతిపెద్ద దీపావళి వేడుక నిర్వహించడం నాకు గర్వంగా ఉంది. దక్షిణాసియా అమెరికన్లున నా సిబ్బందిలో కీకల సభ్యులు. ప్రపంచంలో అన్నిరంగాల్లో అత్యంత వేగంగా దక్షిణాసియా అమెరికన్లు అభివృద్ధి చెందుతున్నారు. పరిపాలనలో అందరూ సహకరించారు. 2016 నవంబర్‌లో దక్షిణాసియా అమెరికన్లపై ద్వేషం, శత్త్రువం ఏర్పడింది. అపుపడే జిల్‌ బైడెన్, నేను మొదటి దీపావళి వేడుకను వైస్‌ ప్రెసిడెంట్‌ నివాసంలో నిర్వహించాం. అప్పుడు ఐరిస్‌ క్యాథలిక్‌ ప్రెసిడెంట్, వైస్‌ ప్రనెసిడెంట్, హిందువులు, బౌధ్ధులు, జైనులు, సిక్కులు హాజరయ్యారు. ఇప్పుడు దీపావలి వేడుకలు గర్వంగా, ఘనంగా శ్వేత సౌధంలో జరుగుతున్నాయి’ అని వివరించారు.

కమలా హారిస్‌పై ప్రశంసలు..
ఇదిలా ఉండగా నవంబర్‌ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల బరిలో డెమొక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై బైడెన్‌ ప్రశంసలు కురిపించారు. ఆమెను 2020లో తన రన్నింగ్‌మేట్‌గా ఎంచుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. కమలా హారిస్‌నుస్మార్ట్‌గా అభివర్ణించారు. ఆమె విశ్వసనీయ నాయకురాలని పేర్కొన్నారు. దేశ సేవలో డొనాల్డ్‌ ట్రంప్‌ కన్నా కమలకు సుదీర్ఘ అనుభవం ఉందని వెల్లడించారు. ఎన్నికల్లో కమలా హారిస్‌ను గెలిపించాలి అని కోరారు. ఇక ఈ దీపావళి వేడుకల్లో తన భార్య జిల్‌ బైడెన్‌ కూడా పాల్గొనాలని కోరుకుంది. కానీ, ఆమె విస్కాన్సిన్‌కు ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. కమల కూడా ఎన్నికల ర్యాలీలో బిజీగా ఉన్నారు అని తెలిపారు.

ఐఎస్‌ఎస్‌ నుంచి సునీత సందేశం..
ఇదిలా ఉంటు.. వైట్‌హౌస్‌లో జరిగిన దీపావళి వేడుకల నేపథ్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో ఉన్న భారతీయ అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ప్రత్యేక సందేశానిన పంపారు. భారతీయ అమెరికన్‌ యాక్టివిస్ట్‌ సువ్రుతి అమాల, అమెరికా సర్జన్‌ జనరల్‌ వివేక్‌ హెచ్‌.మూర్తి తదితరులు వేడుకల్లో మాట్లాడారు. ఇదిలా ఉంటే దీపావళి వేడుకలను వైట్‌హౌస్‌లోని బ్లూ రూంలో నిర్వహించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular