Diwali celebrations : దీపావళి పండుగ భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో భాగం. పండుగకు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. నరకాసురుడు అనే రాక్షసుడిని సత్యభామ సంహరించి నందుకు గుర్తుగా దీపాలు వెలిగిస్తారు. కోపంలో ఉన్న అమ్మవారిని శాంతిప జేసేందుకు దీపాలు వెలిగించారని చరిత్ర. చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావళిని అభివర్ణిస్తారు. దేశ ప్రజలందరూ కులం, మంతతో సంబంధం లేకుండా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. ఈ çపండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో బంగారం, వెండి, వామనాలు, కొత్త బట్టలు కొనుగోలు చేస్తారు. లక్ష్మీ పూజ నిర్వహిస్తారు. దీపావళి సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటిస్తుంది. అయితే మన జరుపుకునే దీపావళిని.. విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు. నేపాల్, బాలి, సింగపూర్, అమెరికా, శ్రీలంక, యూకేలోనూ దీపావళి సందడి కనిపిస్తుంది.
ఆ దేశాల్లోనూ అధికారిక సెలవు..
దీపావళి పండుగ సంరద్భంగా విదేశాల్లోనూ ప్రభుత్వాలు అధికారికంగా సెలవు ప్రకటిస్తున్నాయి. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు దీపావళి సందర్భంగా సెలవు దినంగా ప్రకటిస్తాయి. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోనూ దీపావళి వేడుకలు నిర్వహిస్తారు. దీపాలు వెలిగిస్తారు. పెన్సిల్వేనియా, న్యూయార్క్‌లో దీపావళి రోజు అధికారిక సెలవు.
– 1879 నుంచి ఫిజీలో దీపావళి జరుపుకుంటున్నారు. ఈ పండుగ రోజు అధికారికంగా సెలువు ఇస్తున్నారు.
– మలేషియాలోనూ దీపావళికి అక్కడి ప్రభుత్వం సెలవు ఇస్తుంది. ప్రభుత్వ సెలవుల జాబితాలో దీపావళి పండుగను చేర్చారు.
– మారిషస్‌లో హిందువుల జనాభాను పరిగణనలోకి తీసుకున్న అక్కడి ప్రభుత్వం దీపావళికి సెలవు ప్రకటిస్తోంది. ఈ ద్వీపంలో దీపావళి రోజు దీపాలు వెలిగిస్తారు. ఇళ్లను అందంగా అలంకరిస్తారు.
– హిందూ దేశమైన నేపాల్‌లోనూ దీపావళిని ఘనంగా నిర్వహిస్తారు. అక్కడ దీపావళిని తిహార్ లేదా స్వాంతి అంటారు. అక్కడ పండుగను ఐదు రోజులు జరుపుకుంటారు. ప్రభుత్వం సెలవులు ఇస్తుంది.
– మన పొరుగున ఉన్న శ్రీలంకలోనూ దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో దీపావళికి అధికారిక సెలవు ఇస్తున్నారు.
– సింగాపూర్‌లోనూ దీపావళికి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. లిటిల్ ఇండియాలో దీపావళి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
– దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ట్రినిడాడ్, టొబాగోలో కూడా దీపావళిని పబ్లిక్ హాలిడేగా పరిగణిస్తారు.