Conspiracy against India: భారత్‌పై త్వరలో పాకిస్తాన్ దాడి చేయబోతోందా.. పుల్వామా తరహా దాడిని మించి దాడి చేయాలని కుట్ర చేస్తోందా.. దాడి ఎక్కడ చేయాలో ప్లాన్ చేస్తోందా అంటే అవుననే అంటున్నారు పాకిస్తాన్ సైన్యంలోని పరిణామాలను గమనిస్తున్న విశ్లేషకులు. పాక్ సైన్యంలో తీవ్ర అస్థిరత పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఇజ్రాయెల్ తరఫున పాలస్తీనాకు వెళ్లి హమాస్ ఉగ్రవాదులను మట్టుపెట్టాలని ఒత్తిడి చేయడమే. అమెరికా ఆదేశాలతో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్‌లో పాల్గొనాలని, హమాస్‌పై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతోంది. సౌదీతో కలిసి పనిచేయబోతున్నామని ముదుగా చెప్పి.. హమాస్‌కు వ్యతిరేకంగా పనిచేయించే ఆలోచన ఆరణంగా సైనికుల్లో ఆగ్రహం, అసంతృప్తి చేకెత్తిస్తున్నాయి. ప్రతినెలా సైనికుల మనోభావాలు సేకరించే నివేదికలు, దర్బార్ సమావేశాల్లో ఈ ఆందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా పనిచేయడం తమ సంస్కృతికి విరుద్ధమని సైనికులు భావిస్తున్నారు.
భారత్‌ను రెచ్చగొట్టేందుకు దాడి ప్లాన్..
పహల్గాం దాడిని మించే స్థాయి ఉగ్రవాడి చర్యలు భారత్‌పై జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. కశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలు ప్రధాన లక్ష్యాలు. మధ్యప్రాంతాల్లో కూడా దాడి అవకాశం ఉంది. పాక్ ఆర్మీ ఇంటర్నేషనల్ కమిట్మెంట్ల నుంచి తప్పించుకోవడానికి భారత్‌ను రెచ్చగొట్టే ఉద్దేశం కలిగి ఉంది. ఆఫ్గానిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలు, కైబర్–ఫఖ్తూంగ్వా, బలూచిస్తాన్ అల్లర్లను సాకుగా చూపి సైన్యాన్ని ఉధృతం చేయాలని ప్రణాళిక. పుల్వామా తరహా దాడి జరిగితే, భారత స్పందనలో సైనికులను ఉపయోగించి గాజా వెళ్లే ఆలోచన ఉప సంహరించుకోవాలని భావిస్తోంది.
అంతర్గత సమస్యలతో భారత్‌పై ప్రభావం
సైనికుల ఆగ్రహం తొలగించడానికి బాహ్య శత్రువును సృష్టించాలని పాక్ నాయకత్వం భావిస్తోంది. ఇది భారత్‌కు ప్రత్యక్ష ముప్పు. పాకిస్తాన్‌కు వాగ్దానాలు ఇచ్చి తప్పించుకోవడం అలవాటే. ఇప్పటికే చైనా, యూఏఈ, అమెరికాతో ఇచ్చిన మాటల్ని భంగం చేసిన చరిత్ర పాక్‌కు ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కమిట్మెంట్ను తప్పించుకోవడానికి భారత్‌ను టార్గెట్ చేయాలనుకుటోంది.
భారత్, ఆఫ్గానిస్తాన్‌పై దాడి చేయించి.. తర్వాత ప్రతిదాడులను ఎదుర్కొనేందుకు సైన్యం అవసరమైన నేపథ్యంలో తాము గాజాకు రాలేమని తప్పించుకునే ప్లాన్‌లో పాకిస్తాన్ ఉంది. ఈ నేపథ్యంలో భారత్, ఆఫ్గానిస్తాన్ అప్రమత్తంగా ఉండాలి.