America Election Result 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. అయితే ఇందులో డెలావేర్ సెనెట్ ఎన్నిక విషయంలో సంచలనం చోటుచేసుకుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. డెలావేర్ స్థానంలో సారా మైక్ బ్రెడ్ విజయం సాధించారు. అయితే ఈ స్థానంలో మొట్టమొదటిసారిగా ఎన్నికైన బహిరంగ లింగమార్పిడి మహిళగా నిలిచారు. సారా డెమొక్రటిక్ అభ్యర్థిగా నిలిచారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, విశ్రాంత పోలీసు అధికారి, రిపబ్లికన్ అభ్యర్థి జాన్ వేలెన్ -111 ను ఓడించారు. అంతేకాదు ఈ రాష్ట్రంలో డెమొక్రటిక్ పార్టీ తొలి స్థానాన్ని గెలుచుకుంది. ఈ స్థానంలో సెనెటర్ గా గెలిచిన 34 సంవత్సరాల సారా.. ఎన్నికల సమయంలో హోరాహోరీగా ప్రచారం చేశారు. ఎన్నికలకు ముందు ఆమె ఈ స్థానంలో 80 శాతం ఓట్లు సాధించి తన ప్రాథమిక ప్రత్యర్థులను సులభంగా ఓడించారు. సెనెటర్ గా ఎన్నికైన ఆమె ఎప్పుడో తన విజయాన్ని అంచనా వేశారు. ఆ సందర్భాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తనను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు..” ధన్యవాదాలు డెలావేర్. మీ ఓట్లు నాకు వేశారు. మీ విలువలను నాకు బోధించారు. మనం పునరుత్పత్తి చేసే స్వేచ్ఛను కలిగి ఉండాలి. ఆ రక్షణ ఈ దేశం ఇవ్వాలి. మన కుటుంబాలకు వేతనంతో కూడిన సెలవులు లభించాలి. పిల్లల ఆరోగ్య సంరక్షణ తక్కువ ధరలో లభించాలి. గృహాలు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉండాలి. ఇది మీ ప్రజాస్వామ్యం. దీనిని మీరు కాపాడుకున్నారు. ఇది అతి పెద్ద బాధ్యత. తదుపరిగా అత్యంత ఘనంగా సాగుతుందని” ఆమె వ్యాఖ్యానించారు.
లింగమార్పిడి పై ప్రచారం
లింగమార్పిడి పై సారా కొంతకాలంగా ప్రచారం చేస్తున్నారు. అమెరికాలో లింగమార్పిడి వ్యక్తులకు స్వేచ్ఛ లభించాలని ఆమె కోరుతున్నారు. గతంలో లింగమార్పిడి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాలలో ఆమె పాల్గొన్నారు. లింగమార్పిడి అనేది వ్యక్తుల ఇష్టమని, దానిని ప్రభుత్వాలు గుర్తించాలని డిమాండ్ చేశారు. వారి హక్కులను అమెరికా కాపాడాలని నినదించారు. సారా చేస్తున్న పోరాటానికి అనేకమంది లింగమార్పిడి వ్యక్తులు బాసటగా నిలిచారు. ఇటీవల ఎన్నికల్లో ఆమె తరఫున వారు ప్రచారం కూడా చేశారు. ఫలితంగా ఆమె విజయం సాధ్యమైంది. రిపబ్లికన్ పార్టీ దేశం మొత్తం సత్తా చూపిస్తుంటే.. సారా మాత్రం డెమొక్రటిక్ పార్టీని డెలా వేర్ స్థానంలో గెలుపొందేలా చేసింది. అయితే సారా గెలుపు ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీస్తోంది. లింగమార్పిడి వ్యక్తులు రాజకీయాలలోనూ రాణించేలా కొత్త బాటలు పరుస్తోంది. అయితే లింగ మార్పిడి వ్యక్తులు గత కొంతకాలంగా అమెరికాలో ఆందోళనలు చేస్తున్నారు. తనకు హక్కులు కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.
&
Thank you, Delaware! Because of your votes and your values, I am proud to be your next member of Congress.
Delaware has sent the message loud and clear that we must be a country that protects reproductive freedom, that guarantees paid leave and affordable child care for all our… pic.twitter.com/QgwRkpUlbD
— Sen. Sarah McBride (@SarahEMcBride) November 6, 2024