Deaths Banned: ఈ లోకంలో ఇద్దరే మంచివారట అందులో ఒకరు ఇంకా పుట్టనివారైతే మరొకరు చనిపోయిన వారట. జ్యాతష్య మరణం ధృవం అని భగవద్గీత చెబుతోంది. ప్రతి మనిషికి పుట్టుక చావు రెండు వింతలే. అవి ఎప్పుడు చోటుచేసుకుంటాయో ఎవరికి అంతు చిక్కడం లేదు. మనిషి అన్ని కనుగొన్నా చావు పుట్టుకల మీద మాత్రం ఏమీ తెలుసుకోలేకపోయాడు. దీంతో చావు పుట్టుకల మీద ఎవరికి కూడా ఇసుమంతైనా నిజం తెలియకపోవడం విచిత్రమే. మనిషి జన్మించి ఇన్ని యుగాలైనా ఇప్పటివరకు మునులకు కూడా సాధ్యం కానిది చావు పుట్టుకలే.

ఉత్తర ధృవంలోని నార్వేలోని ఓ చిన్న పట్టణం లాంగ్ ఇయర్బైస్ లో మరణాలను నిషేధించారు. మీరు విన్నది నిజమే. కానీ ఇదో విచిత్రమైన ఘటనగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ శీతాకాలంలో చలి తీవ్రంగా ఉంటుంది. దీంతో జీవించడం చాలా కష్టమే. అందుకే ఇక్కడ చనిపోవడానికి అనుమతించరు. గత డెబ్బయి ఏళ్లలో ఇక్కడ ఎవరు చనిపోలేదంటే అతిశయోక్తి కాదని తెలుస్తోంది.
ఇంతకీ ఇక్కడ జరిగేదేమిటంటే చలి కారణంగా ఇక్కడ చనిపోయిన వారి మృతదేహాలు చాలా కాలం ఫ్రెష్ గా ఉంటాయి. దీని వల్ల పూడ్చడానికి చాలా కాలం పట్టేది. ఈ క్రమంలో ఇక్కడ ఇన్ ఫ్లూయెంజా అనే వ్యాధి సోకింది. దీంతో ఇక్కడ చనిపోకూడదని నిషేధం విధించారు. అంటే ఎవరైనా అత్యవసరమైన పరిస్థితుల్లో హెలికాప్టర్ లేదా విమానంలో వేరే ప్రాంతానికి తరలించి అక్కడ చనిపోయిన తరువాత ఖననం చేస్తారు. దీంతో 1917 నుంచి ఇక్కడ ఎవరికి అంత్యక్రియలు చేయకపోవడం తెలిసిందే.
చనిపోయిన వ్యక్తి శరీరంలో ఉన్న ఇన్ ఫ్లూయెంజా వైరస్ ఇతరుల శరీరాల్లోకి వ్యాపించే అవకాశం ఉన్నందున ఇక్కడ ఎవరిని దహనం చేసేందుకు అవకాశం కల్పించడం లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ మరణించే వారు లేకపోవడం గమనార్హం. జనాభా కూడా రెండు వేల లోపే ఉంటుందట. కానీ మరణాన్ని నిషేధించడం మాత్రం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు.