Covid : కరోనా మహమ్మారి మూడేళ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించింది. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ దాదాపు భూ మండలాన్ని అంతా చుట్టి జనాన్ని అతలాకుతనం చేసింది. అయితే ఆ తర్వాత అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు.. ప్రజల్లో అవగాహన కారణంగా ఈ వ్యాధి ప్రజల నుంచి దూరమైంది. అయితే ఆ తర్వాత వివిధ మార్పులు చెందిన కరోనా కొన్నాళ్లపాటు భయపెడుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ వైరస్ మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆసియా కు చెందిన కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఆయా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే ఓ దేశానికి చెందిన ఆరోగ్య శాఖ కరోనా కేసులు పెరుగుతున్నట్లు నివేదిక బయటపెట్టింది. తాను ఊహించిన దానికంటే 25% ఎక్కువగా కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఇంతకీ ఏ దేశాల్లో కరోనా పెరుగుతుందంటే?
Also Read : ఇక రోహిత్ “వాంఖడే”.. హిట్ మ్యాన్ అభిమానులు కాలర్ ఎగరేసే ఘట్టం ఇది: వీడియో వైరల్
2019 డిసెంబర్లో కరోనా వైరస్ బయటకు వచ్చింది. ఆ తర్వాత 2020లో భారత్ లోకి ఎంట్రీ ఇచ్చి ఫిబ్రవరి నుంచి మరింతగా విజృంభించింది. అప్పటినుంచి దేశం మొత్తం కొన్ని రోజులపాటు లాక్ డౌన్ లోనే ఉంది. అయితే మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో భారత్ లో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉండి అనేకమంది మరణానికి కారణమైంది. ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకున్న కోట్ల మంది ప్రజలు కరోనా బారినపడి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రజల్లో ఇమ్యూనిటీ తగ్గడంతోనే కరోనా పెరిగిపోయిందని అప్పట్లో గుర్తించారు. ఇప్పుడు కూడా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుండటంతోనే కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలుపుతున్నారు.
తాజాగా ఆసియా కు చెందిన హాంకాంగ్ దేశంలో కరోనా విజృంభిస్తుంది. 2025 జనవరి నుంచి మే 3వ తేదీ వరకు ఈ దేశంలో 31 మంది కోవిడ్ కారణంగా చనిపోయినట్లు ఆ దేశంలోని ఓ అధికారి బయటపెట్టారు. అయితే గతంలో కంటే ఈ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ ఇటీవల మాత్రం ఇవి ప్రమాదకరంగానే అని ఆ అధికారి పేర్కొంటున్నారు.
సింగపూర్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ దేశంలో మే 3 వరకు 14,200 కేసులు నమోదయినట్టు ఆ దేశానికి చెందిన ఆరోగ్య ప్రతీది పేర్కొన్నారు. అయితే తాము అంచనా వేసిన దాని కంటే 28% అధికంగా కరోనా కేసులు పెరిగినట్టు పేర్కొన్నారు. ఈ దేశంలో కరోనా మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. థాయిలాండ్ చైనాలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజల్లో మరోసారి ఆరోగ్య అలవాట్లు తగ్గిపోయి ఇమ్యూనిటీ పవర్ తగ్గడంతోనే ఈ కేసులు మళ్లీ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి కరోనా పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కొందరు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కరోనా వివిధ రూపాల్లో వివిధ కేసులు నమోదు అయినప్పటికీ తాజాగా మరోసారి విజృంభించడంతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కొందరు చెబుతున్నారు.