Viral Video : వాంఖడే స్టేడియం ఎంతోమంది ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెటర్లుగా తయారు చేసింది. అందులో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఒకడు. రోహిత్ శర్మకు తొలినాళ్లల్లో వాంఖడే స్టేడియం లోకి ప్రవేశించడానికి అనుమతి లభించలేదు. కానీ ఎప్పుడైతే అతడు క్రికెట్లో రాణించడం మొదలుపెట్టాడో.. అప్పటినుంచి అతడికి ఆ స్టేడియంలోకి రాజ సత్కారం లభించింది. ముంబై జట్టు తరుపున రంజీలలో.. ఇప్పుడు ఐపీఎల్ లో తిరుగులేని స్థాయిలో ఆడుతున్న అతడికి జీవిత కాలం గుర్తుపెట్టుకునే గౌరవం లభించింది. శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో అతడికి కనివిని ఎరుగని స్థాయిలో సత్కారం లభించింది. అతడు టీమిండియా కు.. ముంబై జట్టుకు చేసిన సేవలను గుర్తిస్తూ.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్ కు అతడి పేరును ఖరారు చేశారు. ఇటీవల ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. అధికారికంగా అతని పేరు మీద ఏర్పాటు చేసిన స్టాండ్ ను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ అద్భుతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్న విస్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ హాజరయ్యారు. స్టేడియంలోని మూడు స్టాండ్లకు రోహిత్ శర్మ, శరద్ పవార్, మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ పేర్లను ఖరారు చేశారు. అంతేకాదు ఆ స్టాండ్లను కూడా ప్రారంభించారు. ఇక ఆఫీస్ లాంజ్ కు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆమోల్ కాలే పేరును పెట్టారు. దాన్ని కూడా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన అతిధులు రోహిత్ శర్మ గొప్పతనాన్ని గురించి వివరించారు..” రోహిత్ శర్మకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఒకానొక సందర్భంలో అతడికి ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రవేశించడానికి అనుమతి లభించలేదు. అక్కడి నుంచి స్టేడియంలో ఒక స్టాండ్ కు తన పేరు పెట్టుకునేదాకా అతడు ఎదిగాడు. టీమిండియా కు అద్భుతమైన విజయాలు అందించాడు. రంజీలలో ముంబై జట్టుకు తిరుగులేని గెలుపులు దక్కేలా చేశాడు. చివరికి ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ సైతం ఐదుసార్లు విజేతగా నిలిపాడు.
Also Read : గిల్ కాదు, బుమ్రా కాదు.. ఇంగ్లాండ్ టూర్ లో ఇతడు ఉంటేనే ఇండియా గెలుస్తుంది!
భావోద్వేగం
తన పేరు మీద స్టాండ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీరు ఉబికి వస్తున్నప్పటికీ.. అతడు ఆపుకుంటూ. ఆ మహత్తర ఘట్టాన్ని చూశాడు. అంతేకాదు స్టాండ్ ఏర్పాటు చేసిన తర్వాత తన పేరును మరొకసారి చూసుకొని మురిసిపోయాడు. ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మ సతీమణి, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ తన ప్రయాణాన్ని వచ్చిన అతిథులతో పంచుకున్నాడు. ” ఈ ప్రయాణం ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. ఎన్నో అనుభూతులను ఇచ్చింది. ఇవన్నీ చూస్తుంటే ఒక్కసారిగా జీవితాన్ని మళ్లీ నెమరు వేసుకున్నట్టు అనిపిస్తోందని” రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ పేరుతో స్టాండ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ముంబై ఇండియన్స్ జట్టు సహ యజమాని ఆకాష్ తన సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు..” రోహిత్ శర్మ గొప్ప క్రికెటర్. అతడు ముంబై జట్టుకు అద్భుతమైన సేవలు అందించాడు. ఆ సేవలకు లభించిన గుర్తింపు ఇది” అంటూ ఆకాష్ అంబానీ వ్యాఖ్యానించాడు. ఆ వీడియోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
Akash Ambani Congratulating Rohit Sharma for the new stand named after him at Wankhede pic.twitter.com/FDWmj1kWKf
— Johns. (@CricCrazyJohns) May 16, 2025
View this post on Instagram