missile systems : యుద్ధం అనేది విధ్వంసానికి పరాకాష్ట. ఆ విధ్వంసం తాలూకూ పర్యవసనాలను ప్రపంచం మొత్తం చవి చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకు రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరిగాయి. దానివల్ల యూరప్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పటికి ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుందో తెలియదు కాని.. ప్రస్తుతానికైతే పరిస్థితి అద్వానంగా ఉంది. దీన్ని మర్చిపోకముందే ఇజ్రాయిల్ – ఇరాన్ యుద్ధం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఉద్రిక్తతను సృష్టిస్తోంది. హెజ్ బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ను ఇజ్రాయిల్ చంపిన తర్వాత.. ఇరాన్ క్షిపణులతో ఇజ్రాయిల్ పై దాడి మొదలు పెట్టింది. దీంతో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్టేనని సంకేతాలు వినిపించాయి. అయితే ఇరాన్ చేసిన క్షిపణి దాడులను ఇజ్రాయిల్ సమర్థవంతంగా ఎదుర్కొంది. దానికి కారణం ఆ దేశం వద్ద సమర్థవంతమైన యాంటి – ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ.. అలాంటి వ్యవస్థను ప్రపంచంలో ఐదు దేశాలు కలిగి ఉన్నాయి.. ఇందులో భారత్ ఏ స్థానంలో ఉందంటే..
చైనా
చైనా వద్ద HQ -9 యాంటి ఎయిర్ క్రాఫ్ట్ చివని వ్యవస్థ ఉంది. ఇది శత్రు దేశాలకు చెందిన విమానాలను, క్రూయిజ్, ఉపరితల, బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయగలుగుతుంది. హెలికాప్టర్లను మట్టి పెట్టగలుగుతుంది. దీనిని 1980లో అభివృద్ధి చేశారు. అమెరికాలోని పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ తరహాలో రూపొందించారు.
అమెరికా
అమెరికా పేట్రియాట్ (MIM -104) అనే వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది అన్ని రకాల వాతావరణంలోనూ ఏక్షిపని వ్యవస్థ పనిచేస్తుంది. బాలిస్టిక్, క్రూయిజ్, అధునాతన విమానాలను ఇది పసిగట్టి పడగొడుతుంది. 1974 లో అమెరికా తన సైన్యంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది ఏకకాలంలో 100 క్షిపణులను గుర్తించి నాశనం చేస్తుంది. ఇక ఇందులో ప్రాణాంతకమైన ఫైర్ సబ్ యూనిట్ కూడా ఉంటుంది. ఇందులో లాంచర్లు, నాలుగు క్షిపణులు ఉంటాయి.
ఇజ్రాయిల్
డేవిడ్ స్లింగ్ పేరుతో ఇజ్రాయిల్ వైమానిక, చిపని రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంది. దీనిని అభివృద్ధి చేయడంలో ఇజ్రాయిల్ కు అమెరికా సహకరించింది. MIM 23 హక్, MIM 104 పేట్రియాట్ అనే వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీంతోపాటు ఐరన్ డోమ్ కూడా ఇజ్రాయిల్ దేశానికి రక్షణ కలిగిస్తుంది.
రష్యా
రష వద్ద S-400 అనే రక్షణ వ్యవస్థ ఉంది. ఇది అత్యంత ప్రాణాంతకమైన క్షిపణి వ్యవస్థ. 1990లో రష్యా దేశాన్ని చెందిన అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో దీనిని అభివృద్ధి చేసింది. ఇందులో ఉన్న క్షిపణులు అంతర్గతంగా, బహిర్గతంగా వచ్చే ముప్పును పసిగట్టి, ప్రత్యర్థి దేశాలు పంపించే క్షిపణులను సర్వనాశనం చేస్తాయి.
భారత్
మనదేశంలో వైమానిక రక్షణ వ్యవస్థ అత్యంత శత్రు దుర్భేద్యంగా ఉంది. ఇది అత్యంత అధునాతన క్షిపణి నిరోధక వ్యవస్థ లాగా పని చేస్తుంది. దీనిని ఏర్పాటు చేయడంలో స్వదేశీ, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం ఉంది. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, అడ్వాన్సుడ్ ఎయిర్ డిఫెన్స్ అనేవి భారత రక్షణ క్షిపణి వ్యవస్థలు. ఇవి బాలిస్టిక్ దాడులను అడ్డుకుంటాయి. ఇక ఇందులో ఆకాశ్ క్షిపణి వ్యవస్థ 30 కిలోమీటర్ల పరిధిలోని గగనతలలో ఉన్న శత్రు క్షిపణులను ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఇది ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించగల క్షిపణి వ్యవస్థ. ఇక రష్యా కు చెందిన ఎస్ -400 అనే రక్షణ వ్యవస్థను భారత్ ఇటీవల కొనుగోలు చేసింది. ఇది బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, ఇతర వైమానిక దాడులను ఇది అడ్డుకుంటుంది.. ఇక ఇది మాత్రమే కాకుండా భారత్ – ఇజ్రాయిల్ దేశాలు సంయుక్తంగా బరాక్ -8 పేరుతో అత్యాధునిక వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేశాయి.