India border Countries : భారత్ తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలివే..

ఆఫ్ఘనిస్తాన్ దేశంతో మనకు 80 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు పరిధిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం విస్తరించి ఉంది.

Written By: NARESH, Updated On : May 18, 2024 8:34 pm

India border Countries

Follow us on

India border Countries : ఒక పొలానికి గెట్లు ఎలాగైతే ఉంటాయో.. ఒక దేశానికి మరొక దేశంతో సరిహద్దులు ఉంటాయి. మన దేశం చైనా నుంచి మొదలు పెడితే పాకిస్తాన్ దేశం వరకు సరిహద్దులు కలిగి ఉంది. చైనా, పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో ఎప్పటికీ ఏదో ఒక రకంగా వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. అందుకే మన దేశం భద్రతాపరంగా ఆ ప్రాంతాలను సున్నితమైనవి గా పరిగణిస్తుంటుంది. ఇంతకీ మన దేశంతో సరిహద్దు పంచుకునే దేశాలు ఏమిటో ఒకసారి చూద్దాం.

బంగ్లా దేశ్

ఈ దేశంతో మనకు 4,096 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు పరిధిలో పశ్చిమబెంగాల్, అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి.

మయన్మార్

మనకు ఈశాన్యాన ఈ దేశం ఉంటుంది. 1,458 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఈ దేశంతో ఉంది.. ఈ దేశానికి సరిహద్దు పరిధిలో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.

India border Countries

నేపాల్

హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉన్న దేశం ఇది. మన దేశం నేపాల్ తో 1,752 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. ఈ సరిహద్దు పరిధిలో పశ్చిమబెంగాల్, బీహార్, సిక్కిం, ఉత్తరాఖాండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.

చైనా

చైనా దేశంతో మనకు 3,917 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ దేశ సరిహద్దు పరిధిలో జమ్ము కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖాండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.

భూటాన్

ఈ దేశం తో మనకు 587 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దీని పరిధిలో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.

పాకిస్తాన్

పాకిస్తాన్ దేశంతో మనకు 3,310 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు పరిధిలో గుజరాత్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి.

ఆఫ్ఘనిస్తాన్

ఆఫ్ఘనిస్తాన్ దేశంతో మనకు 80 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు పరిధిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం విస్తరించి ఉంది.