https://oktelugu.com/

Costly Cities: ప్రపంచంలోనే వెరీ కాస్ట్లీ సిటీలు.. ఇక్కడ ఏవైనా వస్తువులు కొనాలంటే?

సాధారణంగా ఉండే షాప్‌ల కంటే షోరూమ్‌లో ఉండే షాపుల్లో ఏ వస్తువు ఖరీదు అయిన ఎక్కువగానే ఉంటుంది. అలాంటిది రిచ్చెస్ట్ సిటీల్లో కూడా మరి ఖరీదులు ఉంటాయి కదా. అయితే ఈ ప్రపంచంలో వెరీ కాస్ట్లీ ఉండే సిటీలు ఏవి? ఇక్కడ వస్తువులు ఏవైనా కొనాలంటే ఖరీదు ఉంటాయా? లేకపోతే తక్కువగా ఉంటాయా? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 12, 2024 / 04:06 AM IST

    singapore

    Follow us on

    Costly Cities: ఈ ప్రపంచంలో ఖరీదైన వస్తువులు చాలా ఉన్నాయి. వీటిని ఎక్కువగా ధనవంతులు వాడుతుంటారు. ఏ వస్తువు కొన్ని అందులో కాస్ట్లీకే ప్రాధాన్యత ఇస్తారు. ధరించే దుస్తుల నుంచి వేసుకునే చెప్పుల వరకు కాస్ట్లీనే వాడుతారు. ఏదో ఒకసారి రెండు సార్లు వేసుకునే వాటి కోసం కూడా ధనవంతులు ఎక్కువగానే ఖర్చు చేస్తుంటారు. అయితే ఈ ప్రపంచంలో ఖరీదైన వస్తువులతో పాటు కొన్ని ఖరీదైన సిటీలు కూడా ఉన్నాయి. ఈ సిటీల్లో మనం ఏవైనా వస్తువులు కొనాలన్నా కూడా కష్టమే. ఎందుకంటే సాధారణంగా ఉండే షాప్‌ల కంటే షోరూమ్‌లో ఉండే షాపుల్లో ఏ వస్తువు ఖరీదు అయిన ఎక్కువగానే ఉంటుంది. అలాంటిది రిచ్చెస్ట్ సిటీల్లో కూడా మరి ఖరీదులు ఉంటాయి కదా. అయితే ఈ ప్రపంచంలో వెరీ కాస్ట్లీ ఉండే సిటీలు ఏవి? ఇక్కడ వస్తువులు ఏవైనా కొనాలంటే ఖరీదు ఉంటాయా? లేకపోతే తక్కువగా ఉంటాయా? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

    సింగపూర్
    ప్రపంచంలో ఉండే ఖరీదైన నగరాల్లో సింగపూర్ ఒకటి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా గుర్తింపు పొందింది. ఇక్కడ జీవించాలంటే చాలా కష్టం. ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తేనే జీవించడం ఈజీ అవుతుంది. సింగపూర్‌లో ఇళ్లు, అద్దెలు, ఏవైనా వస్తువులు కొనాలన్నా కూడా కష్టమే.

    హాంకాంగ్
    ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో హాంకాంగ్ ఒకటి. సింగపూర్ తర్వాత స్థానంలో ఈ నగరం ఉంది. ఈ నగరంలో ఆస్తి ధరలు మండిపోతుంటాయి. చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి. ఈ నగరంలో ఆస్తులు ఏవైనా కొనాలంటే ఎన్ని ఆస్తులు అమ్మిన కూడా సరిపోవు.

    ఒసాకా
    జపాన్‌లో ఉండే ఒసాకా నగరం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ నగరంలో ఇళ్లకు చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ కేవలం ఇళ్లు, ఆస్తి మాత్రమే కాకుండా ఫుడ్, వైద్యం, మిగతావి కూడా ఖరీదైనవే. ఇక్కడ ప్రజలు నిత్యావసరాలకు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది.

    న్యూయార్క్
    అమెరికాలోని న్యూయార్క్ నగరం కూడ ఖరీదైనది. ఎక్కువగా వినోదాలు, ఇళ్లు ఖరీదుగా ఉంటాయి. అలాగే ఉద్యోగాల కోసం ఎక్కువ మంది అమెరికాకు వెళ్తుంటారు. దీంతో అపార్ట్‌మెంట్‌లు చాలా కాస్ట్లీ ఉంటాయి.

    పారిస్
    ఎక్కువగా విలాసవంతమైన జీవితం గడపడానికి చాలామంది పారిస్ వెళ్తుంటారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా కొత్తగా ఉండటంతో ఇక్కడ అన్ని కూడా ఖరీదైనవే ఉంటాయి. ఇక్కడ ఉండే హోటల్స్, రిసార్ట్స్‌‌లో చాలా ఎక్కువ ధరలు ఉంటాయి.

    జ్యూరిచ్
    అత్యంత ధనిక నగరాల్లో జ్యూరిచ్ ఒకటి. ఇక్కడ ప్రజలు నివసించాలంటే ధనవంతులు అయి ఉండాలి. లేకపోతే ఎక్కువ మొత్తంలో ఆదాయం రావాలి.

    టెల్ అవీవ్
    ఇజ్రాయెల్‌లో ఉన్న టెల్ అవీవ్ అత్యంత ధనిక నగరాల్లో ఒకటి. ఇక్కడ సాంకేతిక పెరగడం వల్ల అన్ని వస్తువులు ఖరీదు ఉంటాయి. ముఖ్యంగా ఆస్తులు అయితే చాలా ఎక్కువ ధరలు ఉంటాయి.