Homeఅంతర్జాతీయంChinese Spy Robot: మంచు, చలి తట్టుకోలేక భారత బార్డర్లో రోబోలను దించిన చైనా.. షాకింగ్‌...

Chinese Spy Robot: మంచు, చలి తట్టుకోలేక భారత బార్డర్లో రోబోలను దించిన చైనా.. షాకింగ్‌ వీడియో

Chinese Spy Robot: భారత్‌ను తరచూ కవిస్తున్న మన పొరుగు దేశం చైనా. ఒకవైపు పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే.. ఇంకోవైపు చైనా మన భూభాగాలను ఆక్రమించేందుకు తరచూ ప్రయత్నిస్తోంది. సరిహద్దులు మారుస్తోంది. 2020లో గాల్వన్‌లో భారత్‌ భూభాగంలోకి వచ్చిన చైనా సైనికులను మన ఆర్మీ తిప్పి కొట్టింది. అయినా ఇప్పటికీ ప్రయత్నాలు ఆపడం లేదు. ఇక టెన్నాలజీలో ఎంతో పురోగతి సాధించిన చైనా.. ప్రతీ పనికి రోబోలను ఉపయోగిస్తోంది. తాజాగా సరిహద్దుల్లో కూడా రోబోలను ఏర్పాటు చేసింది. దీనికి సబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మంచు, చలి నేపథ్యంలో ఈ యంత్రం సైన్యం అలసి పోకుండా పనిచేస్తోంది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) మానవ–యంత్ర సమ్మేళన యుద్ధ పద్ధతిని ప్రారంభించింది.

రోబోటిక్స్‌ బూమ్‌..
చైనాలో 150కి పైగా కంపెనీలు హ్యూమనాయిడ్‌ రోబోల తయారీలో పోటీపడుతున్నాయి. ఈ వేగవంతమైన విస్తరణపై జాతీయ అభివృద్ధి సంఘం హెచ్చరించింది, ఆర్థిక బుడగలు ఏర్పడే ప్రమాదం ఉందని. ప్రభుత్వం ఈ రంగానికి ప్రోత్సాహాలు, నిధులు అందిస్తూ భవిష్యత్‌ ఆయుధాలుగా చూస్తోంది. కఠిన వాతావరణంలో పెట్రోలింగ్, భద్రతా పరీక్షలకు ఈ రోబోలు ఉపయోగపడతాయి. మానవ సైనికుల ప్రమాదాలను తగ్గించి, 24 గంటలపాటు నిరంతర పనితీరును నిర్ధారిస్తాయి. యూబ్‌టెక్‌ వాకర్‌ 2 వంటి మోడళ్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి.

2030 నాటికి మానవ సైనికుల అవసరం తగ్గే అవకాశం ఉంది. రోబోలు ముందు వరుసల్లో నిలబడతాయి. భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతల్లో ఈ సాంకేతికత భద్రతా అంశాలను పెంచుతోంది. రక్షణ వ్యూహాల్లో మానవ–యంత్ర సమన్వయం కీలకమవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version