Homeఅంతర్జాతీయంChina mega embassy: బ్రిటన్‌కు చైనా డెడ్‌లైన్‌.. నిశితంగా గమనిస్తున్న భారత్‌!

China mega embassy: బ్రిటన్‌కు చైనా డెడ్‌లైన్‌.. నిశితంగా గమనిస్తున్న భారత్‌!

China mega embassy: బ్రిటన్‌.. నాటో దేశం. యురోపియన్‌ యూనియన్‌ దేశం.. ఫస్ట్‌ వరల్డ్‌ కంట్రీ. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం అయిన బ్రిటన్‌.. క్రమంగా దిగజారుతోంది. ఆర్థికంగా ప్రస్తుతం ఐదో స్థానానికి పడిపోయింది. అమెరికా తర్వాత ఇప్పుడు చైనా నంబర్‌ 2 స్థానంలో ఉంది. నంబర్‌ వన్‌ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఆసియా దేశం చైనా.. ఇప్పుడు యురోపియన్‌ యూనియన్‌ దేశం అయిన బ్రిటన్‌కు డెడ్‌లైన్‌ విధించింది. ఇది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డిసెంబర్‌ 10 నాటికి లండన్‌లోని రాయల్‌ మింట్‌ కోర్టును తమ మెగా ఎంబసీ కోసం కేటాయించాలని బ్రిటన్‌పై చైనా ఒత్తిడి తెస్తోంది. ఈ డెడ్‌లైన్‌ వరకు కేటాయించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించింది. ఈ భవనం యూకే ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌కు సమీపంలో ఉండటం వివాదానికి కారణమవుతోంది.

ఎంఐ5, ఎంఐ6 రిపోర్టులు..
బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థలు ఎంఐ5, ఎంఐ6 ఈ భవనాన్ని చైనాకు కేటాయించడానికి అనుమతి ఇవ్వవచ్చని సిఫారసు చేశాయి. ఎంఐ5 అంతర్గత భద్రతను, ఎంఐ6 విదేశీయ గూఢచార్యాలను పర్యవేక్షిస్తాయి. అయితే చైనా లింక్డిన్‌ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బ్రిటన్‌ పౌరులను రిక్రూట్‌ చేస్తోందని ఎంఐ5 హెచ్చరించింది. ఈ ఎంబసీ నిర్మాణంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ ఫీచర్లు, భవనం కింద అండర్‌గ్రౌండ్‌ కేబుల్స్‌ ఉండటం యూకే కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌కు ముప్పుగా మారవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ పార్టీలపై అనుమానాలు…
లేబర్‌ పార్టీ అధికారంలోకి రావడానికి చైనా నిధులు అందించిందా అనే ప్రశ్నలు విపక్ష నేతలు లేవనెత్తుతున్నారు. ప్రధాని కీర్‌ స్టార్మర్‌తోపాటు హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సభ్యులు చైనా నుంచి డబ్బులు తీసుకున్నారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కన్సర్వేటివ్‌ పార్టీ నాయకురాలు ప్రీతి పటేల్‌ ఈ మెగా ఎంబసీని బ్రిటన్‌ ఆత్మహత్యలా అంటూ వ్యతిరేకిస్తున్నారు. యాక్టివిస్టులు కూడా భద్రతా కారణాలతో వ్యతిరేకత చూపుతున్నారు.

బీజింగ్‌లో యూకే రిక్వెస్ట్‌
బ్రిటన్‌ తన బీజింగ్‌ ఎంబసీ విస్తరణకు అనుమతి కోరగా చైనా డీటెయిల్డ్‌ బ్లూ ప్రింట్‌ అడుగుతోంది. అదే సమయంలో చైనా తన లండన్‌ ఎంబసీ నిర్మాణ డీటెయిల్స్‌ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఈ డౌబుల్‌ స్టాండర్డ్‌ యూకేలో చర్చనీయాంశంగా మారింది. ఎంఐ5 రిపోర్టు ప్రకారం చైనా హెడ్‌హంటర్స్‌ ద్వారా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటోంది.

కీర్‌ స్టార్మర్‌ 2026 ఫిబ్రవరిలో చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ట్రంప్‌–జీ జింపింగ్‌ మధ్య సోయాబీన్స్‌ ఒప్పందం, టారిఫ్‌ తగ్గింపు నేపథ్యంలో చైనా ధైర్యం పెరిగినట్లు కనిపిస్తోంది. యూకేలో బీబీసీ టీవీ లైసెన్స్‌ రద్దు చర్చలు, రాజు పాత్రపై ప్రశ్నలు కూడా ఈ సందర్భంతో ముడిపడి ఉన్నాయి. ఈ పరిణామాలు యూరోపియన్‌ యూనియన్‌తో ఐర్లండ్‌ సంబంధాలపై కూడా ప్రభావం చూపవచ్చు.

రాజును పక్కన పెట్టే ప్రయత్నం..
బ్రిటన్‌ రాజుని పక్కన పెట్టే ప్రయత్నం వెనుక కమ్యూనిస్ట్‌ చైనా హస్తం ఉంది. చైనా చెప్పినట్లుగా చేస్తేనే కీర్‌ స్ట్రామర్‌ చైనా వెళ్లి ఒప్పందాలు చేసుకోగలుగుతాడు లేకపోతే తనకి ముందు పనిచేసిన ప్రధాన మంత్రుల లాగానే రాజీనామా చేయాల్సి వస్తుంది.
అందుచేత తొంగ్డోక్‌ని నిర్భందించడం అనేది నేరుగా మోడీకి వార్నింగ్‌. అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో 2026 ఫిబ్రవరిలో అరుణాచల్‌ ప్రదేశ్‌ మీద దాడికి ప్రయత్నించవచ్చు. అందుకే అరుణాచల్‌ ప్రదేశ్‌ కి కేవలం 100 కి.మీ దూరంలో తన సైన్యాన్ని మొహరించించి ఉంచింది. తొంగ్డోక్‌ అనడం వెనుక ఉన్న సందేశం ఇదే!

భవిష్య వాణి చెప్పిన వంగ బాబా 2025, 2026 లలో ప్రపంచం తీవ్రమైన విపత్తులని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పింది. అవి జన నష్టం కలిగించే యుద్ధాలు, భూకంపాలు, వరదలు, అగ్ని పర్వతాలు విస్పోటనం జరగడాలు ఇప్పుడు మనం చూస్తున్నాము. బహుశా 2026 లో గ్రేట్‌ బ్రిటన్‌ అనేది ఉండకపోవచ్చు. ఐర్లండ్‌ బ్రిటన్‌ తో తెగతెంపులు చేసుకొని యూరోపియన్‌ యూనియన్‌ లో చేరవచ్చు. అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో భారత్‌ చైనాల మధ్య మళ్ళీ ఘర్షణ తప్పకపోవచ్చు. చైనాకి అమెరికా సహకరిస్తుంది అనడంలో సందేహం లేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version