China: చైనా గూఢచర్యం..? పశ్చిమ దేశాల్లో ఆందోళనకు కారణమేంటి..?

డ్రాగన్ ఆధిపత్యాన్ని కంట్రోల్ చేసేందుకు ఈ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న పశ్చిమ యూరప్,అమెరికా దేశాలకు ఇప్పుడు కొత్త సమస్య ఎదురవుతోంది. గత కొన్నాళ్లుగా చైనా ప్రపంచం మీద పట్టు కోసం తన ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టపరుచుకుంటుంది.

Written By: Neelambaram, Updated On : May 22, 2024 12:35 pm

China

Follow us on

China: చైనా ప్రపంచ ఆధిపత్యం కోసం తాను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఎప్పుడు ఏదో ఒక దేశాన్ని గెలకడమే డ్రాగన్ పనిగా పెట్టుకుంటుంది. ఇప్పటికే పసిఫిక్ మహాసముద్రంలో చైనా అమెరికా,పశ్చిమదేశాల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తుంటుంది. సౌత్ సీలో తన సరిహద్దు దేశాలనూ తన మిలటరీ పవర్ తో భయపెడుతోంది. భారత్,ఫిలిప్పీన్స్, తైవాన్,జపాన్,ఆస్ట్రేలియా, మంగోలియా దేశాలకు డ్రాగన్ వ్యవహారం నచ్చడం లేదు. చైనా తీరుపై ఇప్పటికే ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు హిందూ మహాసముద్రంలో మిలటరీ పరంగా ఆ దేశానికి చెక్ పెడుతూ..వస్తోంది.

ఈ నేపథ్యంలోనే డ్రాగన్ ను కంట్రోల్ చేసేందుకు అమెరికా,పశ్చిమ యూరప్ దేశాలు చాన్నాళ్లుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనా దేశానికి సంబంధించిన సంస్థలు ఆఫ్రికా,ఆసియా,దక్షిణ అమెరికా,యూరప్ ఖండాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు కూడా పెట్టాయి. ఇలాంటి వ్యవహారాలు అమెరికా ఆధిపత్యాన్ని ప్రపంచ వేదికపై సవాల్ చేసినట్లు అవుతుంది. అందువల్ల పెద్దన్న,దాని మిత్రదేశాలు చైనా సంస్థల వ్యాపారాలను తగ్గించేందుకు తమశక్తి మేరకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఇరాన్,ఉత్తరకొరియా,పలు ఆఫ్రికా ఖండంలోని దేశాలు చైనాకు మద్దతు ఇవ్వకుండా..ఆయాదేశాల పరిపాల వ్యవహారాల్లో మితిమీరిన జోక్యాన్ని కూడా చేసుకుంటున్నాయి.

అయితే డ్రాగన్ ఆధిపత్యాన్ని కంట్రోల్ చేసేందుకు ఈ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న పశ్చిమ యూరప్,అమెరికా దేశాలకు ఇప్పుడు కొత్త సమస్య ఎదురవుతోంది. గత కొన్నాళ్లుగా చైనా ప్రపంచం మీద పట్టు కోసం తన ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టపరుచుకుంటుంది. అందులో భాగంగానే అన్ని దేశాల్లో జరుగుతున్న అంతర్గత పరిపాలన,వ్యవహారాలపై తన వేగుల ద్వారా నిఘా పెడుతోంది. బ్రిటన్ గూఢచార సంస్థ ఎంఐ6 మాజీ చీఫ్ రిచర్డ్ మూర్ ఇటీవల ఇదే విషయమై ఓ కీలక ప్రకటన చేశారు. చైనా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు బ్రిటన్,పశ్చిమ దేశాల కీలక సమాచారాన్ని సేకరించేందుకు నాన తంటాలు పడుతున్నాయన్నారు. ఇది ఒక రకంగా అమెరికా, పశ్చిమదేశాలకు ఇబ్బందికరమైన పరిస్థితి అన్నారు. వ్యాపార సంస్థల ద్వారా చైనా తన గూఢ చర్యాన్ని విస్తృత పరుస్తోందన్నారు. ఇక ఇటివల హాంగ్కాంగ్ కు సంబంధించిన కొన్ని సంస్థల్లో పనిచేస్తున్న వారు బ్రిటన్ లో గూఢ చర్యానికి పాల్పడినట్లు ఆదేశం గుర్తించింది. దీంతో వెంటనే చైనాకు సంబంధించిన రాయబారిని పిలిపించి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. చైనా చేస్తున్న ఈ గూఢ చర్యంపై అమెరికా,పశ్చిమ దేశాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. డ్రాగన్ ఇలాగే వ్యవహరిస్తే తమకు భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చునే భావనలో ఉన్నాయి. అందుకే యుఎస్, పశ్చిమ యూరప్ దేశాలు చైనాతో ఆచితూచి వ్యవరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.