https://oktelugu.com/

Nisha Madhulika: ఆమె వయసు 65 ఏళ్లు.. సబ్ స్కైబర్లు 14.5 మిలియన్లు.. ఆదాయం నెలకు 12 లక్షలు.. ఇంతకీ ఆమె ఏం చేస్తుందంటే? !

నిషా మధులిక తను చేసే వంటలను సూటిగా సోది లేకుండా చెబుతుంటారు. అందులో ఎటువంటి వ్యంగ్యం ఉండదు. అనవసరమైన ప్రసంగం ఉండదు. పనికిమాలిన చెత్త అంతకంటే ఉండదు. సూటిగా సుత్తి లేకుండా చెబుతుంటారు.

Written By: Anabothula Bhaskar, Updated On : November 13, 2024 5:10 pm

Nisha Madhulika

Follow us on

Nisha Madhulika: ఆమె పేరు నిషా మధులిక. వయసు 65 ఏళ్లు. పిల్లల పెళ్లిళ్లయ్యాయి. మనవళ్లు, మనవరాళ్లు పుట్టారు. వారు కూడా పెళ్లిళ్లు చేసుకున్నారు.. జీవితంలో సంతృప్తికర దశను అనుభవిస్తున్న వయసు ఆమెది. నిషా మధులికకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఆ వంటల్లో ప్రయోగాలు చేయడం అంటే ఇంకా ఇష్టం. అలాంటి విభిన్నమైన వంటలను తన కుటుంబ సభ్యులకు ఎన్నో చేసిపెట్టారు. చేసి పెడుతూనే ఉన్నారు. ఒక రోజు అందరు కూర్చొని భోజనం చేస్తుండగా యూట్యూబ్ ఛానల్ ఎందుకు ప్రారంభించకూడదు అనే చర్చ వచ్చింది. దాన్ని మొదట్లో నిషా మధులిక పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. తర్వాత ఎందుకనో కుటుంబ సభ్యుల మాట వినాలి అనిపించింది. ఇంకేముంది తన ఆసక్తిని బయట పెట్టడం మొదలుపెట్టారు. అలా తను తయారు చేసిన వంటలను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ప్రారంభించారు. ఆమె హంగు ఆర్భాటాల జోలికి వెళ్లరు. నోరు తిరగని పదాల గురించి చెప్పరు. అమెరికా, చైనా వంటకాల గురించి వివరించరు. అజినో మోటో, చైనా సాల్ట్ వంటి కృత్రిమ పదార్థాల గురించి ప్రస్తావించరు. కేవలం మన వంటలు.. ఉత్తరాది వంటల గురించి చెబుతుంటారు. ఆ వీడియోలు కూడా గంటలు గంటలు ఉండదు. జస్ట్ ఇలా చిటికెలో అయిపోతాయి. చూస్తుండగానే కుకింగ్ అయిపోయిందా అనే భావన చూసే సబ్స్క్రైబర్ కు కలుగుతుంది. అందువల్లే ఆమె ఏకంగా 14.5 మిలియన్ సబ్స్క్రైబర్లను పెంచుకున్నారు.

సంప్రదాయ వంటలు.. హిందీ స్టైల్

నిషా మధులిక తను చేసే వంటలను సూటిగా సోది లేకుండా చెబుతుంటారు. అందులో ఎటువంటి వ్యంగ్యం ఉండదు. అనవసరమైన ప్రసంగం ఉండదు. పనికిమాలిన చెత్త అంతకంటే ఉండదు. సూటిగా సుత్తి లేకుండా చెబుతుంటారు. అది కూడా హిందీలోనే.. వెజ్ నుంచి మొదలుపెట్టే నాన్ వెజ్ వంటల వరకు ఆమె చేసిన వంటల గురించి వివరిస్తుంటారు. ఆమె చెప్పే విధానం.. చేసే విధానం సులభంగానే నచ్చుతుంది. అందువల్లే ఆమెను ఆ స్థాయిలో నెటిజన్లు అనుసరిస్తున్నారు. ఆమె చేసిన ఒక్కో వీడియో మిలియన్ వ్యూస్ వెళ్తుంది. వాస్తవానికి ఆమె వయసు వాళ్ళు అనారోగ్యంతోనో.. ఇతర ఇబ్బందులతోనే బాధపడుతుంటారు. వయసు వల్ల వచ్చిన వ్యాధులను తగ్గించుకోవడం కోసం మందులు వాడుతుంటారు. నిషా మధులిక అలా కాదు.. 65 ఏళ్ల వయసులోనూ చలాకీగా ఉన్నారు. తన పని తాను చేసుకుంటున్నారు. వంటలు కూడా చేస్తున్నారు. యూట్యూబ్ సెన్సేషన్ గా కూడా మారిపోయారు. స్థూలంగా చెప్పాలంటే వయసు అనేది ఒక నెంబర్ మాత్రమేనని.. ఆసక్తికి.. అభిరుచికి అది అడ్డంకి కాదని నిషా మధులిక నిరూపిస్తున్నారు. అన్నట్టు ఆమె చేసిన ” ఆగ్రా పేట స్వీట్” ఏకంగా 4.7 కోట్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. కాగా, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నిషా మధులిక ప్రతినెల 7 నుంచి 12 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తారట! ఈ లెక్కన ఏడాదికి 1.44 కోట్ల వరకు ఆమె ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.