Starlink satellite: ఆమధ్య ఎలాన్ మస్క్ తన టెస్లా కార్లను ఇండియాలో విక్రయించడానికి ప్రయత్నాలు చేశాడు. దానికి కేంద్రం ఒప్పుకుంది. కాకపోతే టెస్లా కార్లను భారతదేశంలోని తయారు చేయాలని స్పష్టం చేసింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కార్లను తయారు చేసి.. ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలని సూచించింది. ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు కల్పిస్తామని ప్రకటించింది. కానీ దీనికి మస్క్ సమ్మతం వ్యక్తం చేయలేదు. పైగా టెస్లా విస్తరణకు భారత ప్రభుత్వం మోకాలడ్డుతోందని పనికిమాలిన వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో ఈ విషయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేశారు. మస్క్ తెలంగాణకు వస్తే స్వాగతిస్తామని ప్రకటించారు. భారత ప్రభుత్వం అనుమతి లేకుండా మస్క్ ఎలా వస్తారనే విషయాన్ని కేటీఆర్ మర్చిపోయారు.
ఇక ఇప్పుడు మస్క్ కు చెందిన స్టార్ లింక్ కంపెనీ భారత దేశంలో కమర్షియల్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనుంది. దీనికి సంబంధించి అనుమతులను ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ మంజూరు చేసింది. సరిగ్గా మూడు సంవత్సరాల నుంచి కమర్షియల్ లైసెన్స్ పొందడానికి స్టార్ లింక్ ఎదురుచూస్తోంది . ఇన్నాళ్లకు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనుమతులు ఇచ్చింది. గత నెలలో టెలికాం విభాగం నుంచి స్టార్టింగ్ అనుమతులు సాధించింది. స్టార్ లిక్ మాత్రమే కాకుండా వన్ వెబ్, రిలయన్స్ జియోకు ఈ తరహా అనుమతులు ఇప్పటికే వచ్చాయి. ప్రభుత్వ నుంచి స్పెక్ట్రమ్ రావడం, బేస్ స్టేషన్ ల ఏర్పాటుకు మౌలిక వసతులను ఆ కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు తమ సేవలు సెక్యూరిటీ ప్రోటోకాల్ కు లోబడి ఉన్నాయని నిరూపించుకోవాలి. దాంతోపాటు ట్రయల్స్ కూడా చేపట్టాలి.
Also Read: గ్లోబల్ కంపెనీలను నడిపిస్తున్న భారతీయులు..
శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. ఆ సంస్థ వసూలు చేయబోయే ఛార్జీల పట్ల చర్చ నడుస్తోంది. పక్కా కమర్షియల్ వ్యాపారవేత్త అయిన మస్క్ కచ్చితంగా చార్జీలు పెంచుతాడని ప్రచారం జరుగుతోంది. ఇటీవల స్టార్ లింక్ సంస్థ బంగ్లాదేశ్లో తన కార్యకలాపాలు మొదలుపెట్టింది. డేటా రిసీవర్ కు ఉపయోగించే హార్డ్ వేర్ ధరను 33,000 గా ప్రకటించింది. ఇక నెలవారి ప్రారంభ ప్లాన్ మూడు వేలుగా ఉంది. ఇవే చార్జీలను ఇండియాలో కూడా స్టార్ లింక్ సంస్థ వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జాతీయ మీడియాలో కథనాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మనదేశంలో భారత్ సంచార్ నిగం లిమిటెడ్, జియో, భారతి ఎయిర్ టెల్, బ్రాడ్ బాండ్ సేవలు అందిస్తున్నాయి. వాటితో పోల్చి చూస్తే స్టార్ లింకు ధరలు భారంగా ఉంటుందని తెలుస్తోంది. మస్క్ కంపెనీ అందించే సేవల వల్ల భారత రక్షణ వ్యవస్థకు ప్రమాదం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి . అధిక చార్జీలను విధించి మస్క్ కంపెనీ భారతీయులను దోచేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి.
మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత బ్లూ టిక్ పేరుతో దోపిడికి తెర తీశాడు. బ్లూ టిక్ ద్వారా భారీ ఎత్తున సంపాదించాడు. అయినప్పటికీ ఇంకా ఆ దందాను అతడు మానుకోలేదు. ఇప్పుడు తాజాగా స్టార్ లింక్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు తెర లేపాడు. ప్రతి విషయంలోనూ వాణిజ్య కోణాన్ని మాత్రమే చూసే మస్క్.. స్టార్ లింక్ ద్వారా కూడా అంతకుమించి అనే రేంజ్ లోనే సంపాదిస్తాడని.. మొహమాటం లేకుండా చార్జీలు విధిస్తాడని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మస్క్ కు పోటీగా ఇతర సంస్థలు నిలబడాలంటే.. గట్టి ప్రయత్నాలు చేయాలి. టారిఫ్ ధరలను తగ్గించాలి. లేదా సేవలో నాణ్యతను మరింత పెంచాలి. లేనిపక్షంలో ఆ కంపెనీలు ఇబ్బంది పడక తప్పదు.