Homeఎంటర్టైన్మెంట్4th Week Collections: 'మన శంకర వరప్రసాద్ గారు' 25 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..4వ...

4th Week Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’ 25 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..4వ వారంలోనూ తగ్గని జోరు!

Mana Shankara Vara Prasad 4th Week Collections: ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం 25 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మూడు వారాలు మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన విద్వంసాన్ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. నాల్గవ వారంలో వసూళ్లు తగ్గిపోతాయని చాలా మంది అనుకున్నారు. కానీ మెగాస్టార్ తన జోరుని ఏ మాత్రం కూడా తగ్గించలేదు. 22వ రోజున 56 లక్షలు, 23వ రోజున 51 లక్షలు, 24వ రోజున 43 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇంతటి స్టడీ బ్లాక్ బస్టర్ రన్ సాధారణమైన విషయం కాదు. నేటి తరం స్టార్ హీరోలు కూడా ఈమధ్య కాలంలో ఇలాంటి రన్ పెట్టలేదు. 24 రోజుల పాటు బుక్ మై షోలో ట్రెండ్ అవుతూ వచ్చిన ఈ సినిమా, 25 వ రోజున ట్రెండ్ నుండి వైదొలగింది. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక పాతిక రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా చూద్దాం. నైజాం ప్రాంతం నుండి 46.29 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, సీడెడ్ ప్రాంతం నుండి 22.85 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సీడెడ్ నుండి ఫుల్ రన్ లో 24 కోట్ల షేర్ వస్తుందని ట్రేడ్ ఆశించింది కానీ, 23 కోట్ల వద్దనే రన్ ఆగేలా కనిపిస్తోంది. ఇక ఉత్తరాంధ్రా ప్రాంతం నుండి 22.46 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, తూర్పు గోదావరి నుండి 15.66 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా గుంటూరు జిల్లా నుండి 11.23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, కృష్ణా జిల్లా నుండి 11 కోట్లు, నెల్లూరు జిల్లా నుండి 6.80 కోట్లు వచ్చాయి.

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 224 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 146.24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 13.51 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, ఓవర్సీస్ నుండి 19.38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వసూళ్లు వచ్చాయి.ఓవరాల్ గా ప్రపంచవ్యాపంగా 179.48 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 295 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ శివరాత్రి వరకు ఉండే అవకాశాలు ఉండడం తో కచ్చితంగా ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ మార్కుని దాటుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు అభిమానులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version