China : డ్రాగన్ కంట్రీ చైనా తన అభివృద్ధి కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతుంది. ఎన్ని కుట్రలు కుతంత్రాలు అయిన చేస్తుంది. అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్న చైనా.. ఇప్పుడు మరో కుట్రకు తెరలేపింది. పునరుత్పాదక వనరుల ద్వారా 2060 నాటికి కర్బన తటస్థత సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మింస్తోంది. దీనిద్వారా ఏటా 300 బిలియన్ కిలోవాట్–అవర్స్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలో అతిపెద్దదైన త్రీగోర్జెస్ డ్యామ్ కన్నా మూడురెట్టు పెద్దది. బ్రహ్మపుత్ర నది గ్రేట్ బెండ్‌గా పిలిచే భారీ వంపు ప్రాంతంలో రెండువేల మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది. స్వల్ప దూరంలో నిటారుగా ఉండడంతో అక్కడ జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయి.
సున్నిత ప్రాంతం
డ్యాం నిర్మాణ ప్రాంతం ఇండియన్, యురోపియన్ టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులపై ఉంది. భారీ డ్యాం నిర్మాణంతో ఇక్కడి భౌగోళిక ప్రదేశానికి పర్యావరణానికి తీరని నష్టం కలిగే అవకాశం ఉంది. జీవ వైవిద్యానికి పేరుపొందిన టిబెట్ పీఠభూమి జీవావరణ వ్యవస్థ పెద్ద ఎత్తున మార్పులకు గురి అవుతుందని, జీవుల ఆవాసం విధ్వంసం అవుతుందని భావిస్తున్నారు.
నిరాశ్రయులయ్యే ప్రమాదం
టిబెట్‌లోని మెడాగ్ కౌంటిలో నిర్మించే బ్రహ్మపుత్ర డ్యామ్‌తో స్థానిక ప్రజలు నిరాశ్రయులవుతారు. 13 లక్షలకుపైగా ప్రజలను త్రీగోర్జెస్ డ్యామ్ నిరాశ్రయులను చేసింది. ఈప్రాజెక్టుతోనూ అదేస్థాయిలో, అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. టిబోట్ వాసులు ఈ డ్యామ్‌ను వ్యతిరేకిస్తున్నారు. చైనా తమను కష్టాలపాటు చేస్తూ తాను లబ్ధి పొందుతోందని ఆరోపిస్తున్నారు. డ్యామ్‌తో బౌద్ధారామాలు, ప్రాచీన గ్రామాలు,పవిత్ర ప్రంతాలు మేనిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుస్థిరతకు భంగకరం
సంక్షోభాల సమయంలో డ్రాగన్ ఈ కొత్త డ్యామ్‌ను ఒక ఆయుధంగా వాడుకునే ప్రమాదం ఉంది. దీని నంచి నీటిని విడుదల చేస్తే ప్రజల జీవితాలు అల్లకల్లోలం చేయవచ్చు. ఇండియాలో మౌలిక సదుపాయాలను దెబ్బతీయవచ్చు. సైనిక కార్యకలాపాలకు అడ్డుగా ఉంటుంది. చైనా వ్యూహాత్మకంగా ఎత్తుగడపరమైన ఆయుధంగా మారుతుంది. భారత్, బంగ్లాదేశ్‌ల జల భత్రతకు, ప్రాంతీయ సుస్థిరతకు భంగం కలిగే అవకాశం ఉంది.
ప్రాంతీయ సహకారం
చైనా చేపట్టిన అధ్యయనం ప్రకారం.. బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ నిర్మిస్తే సమన్వయం, సహకారాలతో నిర్వహిస్తే ఎంఆకాలంలోనూ జల ప్రవాహాలు పెరిగి నదీ తీర దేశాలన్నింటికీ ప్రయోజనం కలుగుతుంది. అయితే ఆయా దేశాల మధ్య నమ్మకం లోపించడం వల్ల సమన్వయం సాధన కుదరకపోవచ్చు. ఇండియా, బంగ్లాదేశ్,చైనా మధ్య సంప్రదింపులు కొనసాగించాల్సిన అవసరం ఉంది.
భౌగోళిక రాజకీయ సాధనం
బారత్, బంగ్లాదేశ్‌కు చైనా నీటి పంపకానికి ఒప్పందాలేవీ లేవు. కొత్త డ్యామ్ తమ నీటి భ6దతకు భంగకరమని రెండు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా దిగువ దేశాల్లో వ్యవసాయం, తాగునీరు, జల విద్యుత్ ఉత్పత్తిపై చైనా ప్రభావం చూపుతుంది. టిబెట్‌లోని డ్యామ్ నిర్మాణ ప్రదేశం భారత్‌తో వివాదాస్పద సరిహద్దులకు సమీపంలోనే ఉంది. ప్రపంచంలోనే అత్యంత నీటి ఒత్తిడికి గురవుతున్న దేశాల్లో భారత్ ఒకటి. డ్యామ్‌తో నదీ ప్రవాహానికి మార్పులు చేయగల సామర్థ్యం తమ చేతికి దక్కడాన్ని డ్రాగన్ తన భౌగోళిక రాజకీయానికి వాడుకునే ప్రమాదం ఉంది.