Chamoy thipyaso: మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. ఈ తప్పులకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఏవో చిన్న తప్పులకు అయితే పెద్దగా శిక్ష ఉండదు. కానీ పెద్ద తప్పులు చేస్తే మాత్రం ఏళ్లు లేదా జీవిత ఖైదు శిక్ష కూడా వేస్తుంటారు. ఎంతో మంది తప్పులు చేస్తూ.. జైలుకు వెళ్తుంటారు. అయితే వారి తప్పును బట్టి ఎన్ని ఏళ్లు జైలు శిక్ష వేయాలి? లేదా జరిమానా విధించాలని నిర్ణయించారు. ఎవరిది అయిన చిన్న తప్పు ఉంటే జరిమానాతో వదిలేస్తారు. కానీ సరిదిద్దుకోలేని తప్పు ఉంటే మాత్రం వారికి జీవితాంతం శిక్ష వేస్తుంటారు. ఇలా జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న వారు ఎంతో మంది ఈ ప్రపంచంలో ఉన్నారు. అయితే ఏదైనా తప్పు చేస్తే ఒకటి, రెండు, మూడు, జీవిత ఖైదు శిక్ష అనేది వేస్తుంటారు. కానీ ఓ మహిళ చేసిన తప్పుకు ఆమెకు 1,41,078 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఇంతకీ ఎవరీ ఆ మహిళ? అసలు ఆమె చేసిన తప్పు ఏంటి? ఎందుకు ఇన్నేళ్లు జైలు శిక్ష విధించారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
థాయ్‌లాండ్‌కి చెందిన ఓ మహిళలకు 1,41,078 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. ఎందుకంటే ఆమె ఎందరో ప్రజలను మోసం చేసి డబ్బు లాక్కోంది. థాయ్‌లాండ్‌కు చెందిన చమోయ్ థిప్యాసో చిట్ ఫండ్ పథకం ప్రారంభించింది. చమోయ్ ఫండ్ అనే చిట్ ఫండ్ స్కీమ్‌ను స్టార్ట్ చేసి.. అందులో పెట్టుబడి పెట్టాలని ప్రజలను సూచించింది. ఇందులో డబ్బులు పెడితే రాబడి అధికంగా వస్తుందని షేర్లు చూపించి అందరిని నమ్మించింది. దీంతో దాదాపుగా 16000 మంది అందులో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. దాదాపుగా 200 నుంచి 300 మిలియన్ల డాలర్ల డబ్బును ప్రజల నుంచి సంపాదించింది. అయితే ఈ స్కీమ్ కేవలం థాయ్‌లాండ్‌లోనే కాకుండా బయట దేశాల్లో కూడా తీసుకొచ్చింది. ఇండియాలోని కేరళలో కూడా ఈ స్కీమ్ బాధితులు చాలా మంది ఉన్నారు.
ఇలా వేల మంది ప్రజలను మోసం చేసి భారీ మొత్తంలో డబ్బును సంపాదించుకుంది. చాలా మంది ప్రజలు డబ్బులు కట్టి మోసపోయారు. పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఆశ చూపించడంతో మధ్య తరగతి, పేద తరగతి వారు కూడా ఉన్నారు. వీరందరూ పెద్ద మొత్తంలో డబ్బును పొగోట్టుకున్నారు. ఇంత మోసం చేసినందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం ఆమెకు 1,41,078 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. చమోయ్ థిప్యాసో ప్రభుత్వ చమురు కంపెనీ అయిన థాయ్‌లాండ్‌లోని పెట్రోలియం అథారిటీలో ఉద్యోగిగా పనిచేసేది. వైమానిక దళంలో తన కనెక్షన్‌లను ఉపయోగించి ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇందులో కేవలం సామాన్య మనుషులే కాకుండా థాయిలాండ్ రాజ కుటుంబంతో పాటు అనేక మంది సైనిక వ్యక్తులు కూడా పెట్టుబడి పెట్టారు. ఇలా ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించి ప్రజలను మోసం చేసినందుకు ఆమెకు ఇన్నేళ్ల పాటు జైలు శిక్ష విధించారు.