పంజాబ్ కింగ్స్ భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, హిట్టర్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. స్టార్ ఆటగాడు క్రిస్ గెల్ బబుల్ అలసట కారణంగా ఐపీఎల్ యొక్క బయో-సెక్యూరిటీ వాతావరణన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచ కప్ కు ముందు రిఫ్రెష్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలంగా బయో బబుల్ లో ఉంటూ రావడంతో మానసికంగా బాగా అలసిపోయానన్న గేల్.. టీ20 ప్రపంచకప్ లో కొత్త ఉత్యాహంతో బరిలోకి దిగేందుకు విరామం కోరుకుంటున్నానని అతను వెల్లడించాడు.
ఈ మేరకు గత కొన్ని నెలలుగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ బబుల్.. ఆ తర్వాత ఐపీఎల్ బబుల్ లో ఉంటున్నానని తెలిపాడు. అయితే ఈ సీజన్ లో గేల్ తన స్థాయికి తగ్గట్లు రాణించలేదనే చెప్పాలి. పేలవంగా ఆడిన అతడు పంజాబ్ తరఫున 10 ఇన్నింగ్స్ లలో 193 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సీజన్ లో గేల్ అత్యధిక స్కోరు 46 మాత్రమే. కాగా గేల్ ప్రకటనపై స్పందించిన పంజాబ్ కింగ్స్ అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపింది. టీ20 వరల్డ్ కప్ లో మంచి ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షిస్తూ.. విషెస్ తెలిపింది. అయితే ఈసారి కూడా ఐపీఎల్ ప్లే ఆఫ్ బెర్తులు ఖాయం అయ్యేలా లేవు.
చెన్నై సూపర్ కింగ్స్ 18 పాయింట్లతో ఇప్పటికే అధికారిక ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 16 పాయింట్లతో ఆ దిశగా వెళుతోంది. మరో రెండు స్థానాల కోసం హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఐదు జట్లు రెండు బెర్తుల కోసం పోటీపడుతున్నాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరువలోనే ఉంది. మరో విజయం సాధిస్తే దాదాపుగా బెంగళూరు కూడా టాప్ -4 లో చోటు దక్కించుకుంటుంది. ఒక మిగిలిన ఒక బెర్త్ కోసం కోల్ కతా, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడుతున్నాయి.