Homeఅంతర్జాతీయం Canada TACA Bathukamma Festival 2024 : కెనడా లోని టోరొంటో నగరంలో TACA ఆధ్వర్యంలో...

 Canada TACA Bathukamma Festival 2024 : కెనడా లోని టోరొంటో నగరంలో TACA ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు.

Canada TACA Bathukamma Festival 2024:  ఉత్తమ బతుకమ్మ బహుమతి ని శ్రీమతి గౌతమి కొండబత్తిని, శ్రీమతిమౌణిక మరం,శ్రీమతి సౌజన్య కొంపల్లి, శ్రీమతి దివ్య ఆడెపుమరియు శ్రీమతి మౌణిక కందకట్ల గారలు గెలుచుకొన్నారు.
పండుగ మొదటినుండి ఆఖరు వరకు ప్రముఖ గాయకురాలుశ్రీమతి పారిజాత గారి  లైవ్ బతుకమ్మ పాటలతో ప్రత్యేక ఆకర్శనగాఎంతో ఉత్సాహంగా జరి గాయి.

ఈ సందర్భంగా TACA ఆద్వర్యంలో మంచి రుచికరమైనభొజనాలు ఏర్పాటు చేసారు. ఈ పండుగ సంబురాలు TACAఅధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల గారి ఆధ్వర్యంలో జరుగగా ఉపాధ్యక్షులు శ్రీ రాఘవ్ కుమార్ అల్లం, కార్యదర్శి శ్రీ ప్రసన్నకుమార్ తిరుచిరాపల్లి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి అనిత సజ్జ,కోషాధికారి శ్రీ మల్లిఖార్జునాచారి పదిర, సాంస్కృతిక సమన్వయకర్త శ్రీ సంతోష్ కొంపల్లి డైరక్టర్లు శ్రీ ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు, శ్రీదుర్గా ఆదిత్యవర్మ భూపతిరాజు, కుమారి విద్య భవణం, ఖజిల్మొహమ్మద్  యూత్ డైరక్టరు శ్రీమతి లిఖిత యార్లగడ్డ, శ్రీ యస్వంత్తేజ కర్రి,   ఎక్స్ అఫిసియో సభ్యురాలు శ్రీమతి కల్పన మోటూరి, ఫౌండెషన్ కమీటీ చైర్మన్ శ్రీ అరుణ్ కుమార్ లాయం, ట్రస్టీబోర్డుచైర్మన్ శ్రీ సురేశ్ కూన, ట్రస్టీలు శ్రీ విద్యాసాగర్ రెడ్డి సారబుడ్ల, శ్రీమతిశృతి ఏలూరి, శ్రీమతి వాణి జయంతి మరియు ఫౌండర్లు శ్రీహనుమంతాచారి సామంతపుడి, శ్రీనాథ్ కుందూరి, మునాఫ్ అబ్దుల్ గారలు పాల్గొన్నారు.

బతుకమ్మలను ప్రక్కనేగల హంబర్ నదిలో నిమజ్జనం చేసిసాంప్రదాయ బద్దంగా తయారు చేసుకొని వచ్చినఫలహారాలను ఆరగించారు. మహిళలు గౌరమ్మ పసుపుకుంకుమలను పంచుకున్నారు.

ఆఖరుగా అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల గారు బతుకమ్మపండుగలో పాల్గొన్న తెలుగు వారందరికీ, వలంటీర్లకు మరియు ఈ దిగ్విజయములో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలుతెలియచేస్తూ వచ్చే నెల నవంబరు 2 న జరిగే దీపావళి పండుగలోతెలుగు వారందరూ పాల్గొనవలసినదిగా కోరుతూ ఈ సంవత్సరముబతుకమ్మ పండుగ వేడుకలను ముగించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular