spot_img
Homeఅంతర్జాతీయంBangladesh Protests : సుప్రీం కోర్టును కూడా దింపేసిన బంగ్లా విద్యార్థులు.. వినడానికి వీరోచితంగా ఉందిగానీ,...

Bangladesh Protests : సుప్రీం కోర్టును కూడా దింపేసిన బంగ్లా విద్యార్థులు.. వినడానికి వీరోచితంగా ఉందిగానీ, ఇది సరైనదేనా?

Bangladesh protests: బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ.. పరిస్థితులు ఏమాత్రం సద్దుమణగడం లేదు. చివరికి గత ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి.. దేశం విడిచి వెళ్లిపోయినప్పటికీ అల్లర్లు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. షేక్ హసీనా భారత్ వెళ్లిపోయిన తర్వాత.. బ్రిటన్ కు శరణార్థిగా వెళ్లాలని చూశారు. ఆ   ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇంకా తన నిర్ణయాన్ని బ్రిటన్ ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. ఇదే క్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అల్లర్లు తగ్గుముఖం పడతాయని అందరూ భావించారు. కానీ ఆ దేశంలో అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. మన వైపు తాజాగా బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈసారి ఆందోళనకారులు సర్వోన్నత న్యాయస్థానాన్ని టార్గెట్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు నినదించారు. ఇతర న్యాయమూర్తులు కూడా తమ పదవులను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నిరసనలు చేపట్టారు. దీంతో ఆందోళనకారుల నిరసనలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిగివచ్చారు. తన పదవికి రాజీనామా చేశారు.

ఆందోళనకారుల నిరసన నేపథ్యంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. న్యాయస్థానంలోని ఇతర న్యాయమూర్తుల తో అత్యవసరంగా సమావేశం కావాలని ఆయన భావించారు. ఇదే క్రమంలో న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి సమావేశానికి తాత్కాలిక ప్రభుత్వం అనుమతించలేదని, ఆయన దేశం విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉందని వార్తలు వినిపించాయి. దీంతో నిరసనకారులు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు.  పలువురు ఆందోళనకారుడు సుప్రీంకోర్టు వద్దకు చేరుకొని నిరసనలు చేపట్టారు. ఫలితంగా న్యాయమూర్తుల సమావేశం ఉన్నట్టుండి నిలిచిపోయింది. ఆందోళనకారులు మరో మెట్టు పైకెక్కి కోర్టును చుట్టుముట్టారు. గంటలో దిగిపోవాలని చీఫ్ జస్టిస్ కు అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఆయన తన పదవి నుంచి వైదొలగక తప్పలేదు.

మహమ్మద్ యునస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బంగ్లాదేశ్లో ఇంకా పరిస్థితులు చక్కబడలేదు. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.. చీఫ్ జస్టిస్ రాజీనామాలు మర్చిపోకముందే బంగ్లాదేశ్ కేంద్ర బ్యాంక్ గవర్నర్ రవూఫ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఆందోళనకారులు కేంద్ర బ్యాంకు కార్యాలయం పైకి దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన బలగాలు నిరసనకారులను చెదరగొట్టాయి. ఇదే క్రమంలో బ్యాంకు కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాయి. మరోవైపు రెండు సంవత్సరాల పదవి కాలం ఉండగానే రవూఫ్ రాజీనామా చేయడం విశేషం.

వీరిద్దరు మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది కీలక అధికారులు తన పదులకు రాజీనామాలు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బంగ్లాదేశ్లో ఈ పరిణామాల వెనుక విదేశీ ప్రభుత్వాల హస్తం ఉందని పలు కథనాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ కథనాలను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ పెద్దలు ఖండిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Bandla Ganesh

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక అయిపోయినట్టే..

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి సుప్రీం కోర్టు నుండి చాలా పెద్ద ఎదురుదెబ్బ నే తగిలింది. తనకు ఉన్నటువంటి స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేయడాన్ని సమర్థిస్తూ...
India vs Zimbabwe

India vs Zimbabwe: టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే: అయ్యర్ సేన మీదనే ఒత్తిడి.. ఎందుకంటే

India vs Zimbabwe:  తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఐర్లాండ్ ఆడింది. ఏకంగా రెండు మ్యాచ్లు గెలిచి.. టీమిడియాకు...
Delhi Cockroach Protest

Delhi Cockroach Protest: ఢిల్లీలో కాక్రోచ్ లో నిరసన.. ముంబై, హైదరాబాద్ నుంచి ఆర్డర్లు.. ఏంటీ వింత పరిస్థితి..

Delhi Cockroach Protest: కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పాలుపంచుకున్న వారిని శిక్షించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని...
PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Oktelugu Epaper