Bangladesh Plane Crash: మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో సోమవారం దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ లోని ఓ స్కూల్ భవనంపై ఎఫ్ 7 ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. వందమంది గాయపడ్డారు. వారిలో 30 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పాఠశాలలో తరగతులు జరుగుతుండగా విమానం కుప్పకూలడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ స్పందించారు. ఆయన వెంటనే సంఘటన స్థలానికి వచ్చారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రమాదంపై విచారణ జరిపిస్తామని ఆయన పేర్కొన్నారు.. విమానం కుప్పకూలిన తర్వాత ఆ ప్రాంతానికి బంగ్లా ప్రజలు భారీగా వచ్చారు. పొగ దట్టంగా వ్యాపించడం.. మంటలు కూడా వస్తుండడంతో ఫైర్ ఇంజన్లు వాటిని ఆర్పేశాయి. సహాయక కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘ఓజీ’ స్లొగన్స్.. మండిపడ్డ పవన్!
ఈ ఘటన జరిగిన తర్వాత జాతీయ మీడియాలో రకరకాలుగా కథనాలు వినిపిస్తున్నాయి.. బంగ్లాదేశ్లో కుప్పకూలిన విమానం చైనాలో తయారయింది. జెట్ తయారీలో చైనా కంపెనీ నాణ్యత పాటించలేదని.. అందువల్లే ఇలా కూలిపోయిందని జాతీయ మీడియా తన కథనాలలో పేర్కొంది.”చైనా కంపెనీలు నాణ్యత పాటించవు. పైగా తక్కువ ధరకు ఉత్పత్తుల తయారు చేస్తామంటూ డబ్బాలు కొడుతుంటాయి. దానివల్ల చాలా దేశాలు ఆ ఉత్పత్తులను కొనుగోలు చేస్తాయి. చివరికి ఇదిగో ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల వల్ల కొనుగోలు చేసిన దేశాలు తీవ్రంగా నష్టపోతుంటాయి. అటు ఆస్తి పరంగా.. ఇటు ప్రాణాలపరంగా దారుణమైన అనుభవాలను ఎదుర్కొంటాయి. అయినప్పటికీ చైనా మారదు. మారే అవకాశం కూడా లేదని” జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇటీవల చైనా తయారుచేసిన ఎఫ్ 7 జెట్ మయన్మార్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. అప్పుడు కూడా భారీగానే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత మయన్మార్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. చైనా ఉత్పత్తుల కొనుగోలు చేయడం వల్లే ఈ దారుణం జరిగిందని వ్యాఖ్యానించింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆ విమానం తయారు చేసిన చైనా కంపెనీ మారు మాట్లాడలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన ప్రమాదం తర్వాత కూడా పెద్దగా మాట్లాడలేదు. అయితే బంగ్లాదేశ్లో ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో.. చైనా మీద ఆధారపడడం మొదలుపెట్టింది. తిండి గింజలు అక్కడినుంచి దిగుమతి చేసుకుంటున్నది. అందువల్లే బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు యునస్ ఈ ప్రమాదంపై చైనాకు వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం విచారణ జరిపిస్తామని మాత్రమే చెప్పారు. దీనిని బట్టి ఆ దేశం చైనా మీద ఎంతలా ఆధారపడిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ ప్రమాదం తర్వాత చైనా దేశం నుంచి ఎటువంటి ఉత్పత్తులు దిగుమతి చేసుకోకూడదని బంగ్లాదేశ్ యువత సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండడం విశేషం.