Balen Shah comments on India: భారత్ చుట్టూ శత్రు దేశాలే. పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా మనపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మనకు మిత్ర దేశం ఏదైనా ఉంది అంటే అది నేపాల్. ఇరు దేశాల సరిహద్దులో కూడా పెద్దగా ఆంక్షలు ఉండవు. ప్రీగా రాకపోకలు సాగుతాయి. అయితే ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని అయినే పాప్ సింగర్ బాలేంద్రషా చైనాకు తొత్తుగా మారుతున్నాడు. అయినా భారత్ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ తాజాగా భారత్‌తో కెలికి కయ్యం పెట్టుకునే పని మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా నేపాల్ పార్లమెంట్‌లో ఆచన చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాల్లో కొత్త చర్చకు దారితీశాయి. లింపియాధురా, లిపులేఖ్, కాలాపాని ప్రాంతాలపై చర్చ సందర్భంగా, ‘‘భారత్ నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిందని, నేపాల్ కూడా భారత్ భూభాగాన్ని అనేక చోట్ల ఆక్రమించింది’’ అని చెప్పారు. ప్రధాని అయ్యాక తనకు ఇటీవలే తెలిసిన విషయమని, ఇరు దేశాలు వాస్తవాలను అధ్యయనం చేసి స్నేహపూర్వకంగా కూర్చొని పరిష్కరించాలని సూచించారు.
బాలెన్ షా వ్యాఖ్యలపై దుమారం..
ఈ వ్యాఖ్యలు నేపాల్‌లోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. విపక్ష నాయకులు ఆధారాలు కోరుతూ, ప్రకటనను రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తర్వాత స్పష్టీకరణ ఇచ్చి, ఇది ‘‘నో–మ్యాన్స్ ల్యాండ్’’ ప్రాంతాలు (ముఖ్యంగా సుస్తా వంటి నదీ ప్రవాహ మార్పుల వల్ల) సంబంధించినదని, ముఖ్య భూభాగ దావాలను మార్చేది కాదని చెప్పింది.
చారిత్రక, రాజకీయ నేపథ్యం..
1816 సుగౌలి ఒప్పందం ఆధారంగా కాలి (మహాకాలి) నది సరిహద్దుగా నిర్ణయించబడింది. కానీ నది మూలం ఎక్కడ ఉందనే విషయంలో అస్పష్టత ఉంది. నేపాల్ లింపియాధురా వరకు తన భూభాగమని వాదిస్తుంటే, భారత్ కాలాపాని, లిపులేఖ్‌ను ఉత్తరాఖండ్‌లో భాగంగా చూస్తుంది. 2020లో నేపాల్ కొత్త రాజకీయ మ్యాప్ విడుదల చేసి వివాదాన్ని మరింత రెచ్చగొట్టింది. ఇటీవల 2026లో భారత్–చైనా మధ్య లిపులేఖ్ ద్వారా కైలాస్ మానసరోవర్ యాత్ర పునరుద్ధరణ ప్రకటనతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. నేపాల్ దీనికి అభ్యంతరం వ్యక్తం చేసింది.
ర్యాపర్ నుంచి రాజకీయ నేతగా..
ఇదిలా ఉంటే బాలేంద్ర షా రాపర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారి, 2025 జెన్–జెడ్ ఉద్యమాల తర్వాత మార్చి 2026లో అతి యువ ప్రధానిగా ఎన్నికయ్యారు. అతని స్వతంత్ర, యాంటీ–ఎస్టాబ్లిష్‌మెంట్ ఇమేజ్ ఈ వ్యాఖ్యల్లో కనిపిస్తుంది. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా నిజాలను అంగీకరించి ముందుకు వెళ్లాలనే ధోరణి.
అవకాశమా లేదా సవాలా?
షా వ్యాఖ్యలు వివాదాన్ని ఏకపక్షంగా చూడకుండా, పరస్పర గుర్తింపుతో సమస్యను పరిష్కరించాలనే యావర్ ఆఫ్ రియలిజంను ప్రతిబింబిస్తాయి. సాటిలైట్ ఇమేజరీ, జాయింట్ సర్వే, చారిత్రక ఆధారాలు, నిపుణుల కమిటీల ద్వారా పరిష్కారం సాధ్యమవుతుంది. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, మానవ సంబంధాలు బలమైనవి. ఇవి ఉద్రిక్తతలను తగ్గించడానికి సహాయపడతాయి.
సరిహద్దు వివాదాలు పొరుగు దేశాల మధ్య సహజం, కానీ వాటిని రాజకీయ లాభం కోసం ఉపయోగించడం రెండు దేశాల ప్రజలకు మేలు చేయదు. బాలేంద్ర షా వ్యాఖ్యలు ఒక వాస్తవిక మలుపును సూచిస్తున్నాయి. దీర్ఘకాలిక పరిష్కారం కోసం ద్విపాక్షిక సంయుక్త కమిటీలను పునరుద్ధరించి, నమ్మకం, పారదర్శకతతో ముందుకు వెళ్లడం రెండు దేశాల బాధ్యత. ఇది మాత్రమే స్థిరమైన స్నేహం మరియు సహకారానికి దారి తీస్తుంది.
