Asim Munir: పాకిస్తాన్‌లో ప్రత్యక్షంగా ప్రజాపాలన సాగుతున్నా.. దానిని నడిపిస్తున్నది మాత్రం ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీరే. షహబాజ్ షరీష్ కేవలం మొక్కుబడిగా ప్రధాని పదవి నిర్వహిస్తున్నారు. అందుకే ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆసిమ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత ప్రమోషన్ పొందిన సైనికాధికారిగా ఆసిమ్ గుర్తింపు పొందారు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ సైనిక చరిత్రలో అసాధారణ అధికారాలు స్వీకరించారు. న్యూక్లియర్ కమాండ్‌తో పాటు రాజకీయ, ఆర్థిక రంగాల్లో పట్టు కొట్టుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఏర్పడిన అనిశ్చితి దేశవ్యాప్త అల్లర్లకు దారితీస్తుండగా, మునీర్‌పై త్రివిధ దళాల నమ్మకం క్షీణించింది. ఈ పరిస్థితి అంతర్యుద్ధ సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో న్యూక్లియర్ కమాండ్‌ను తన చేతుల్లోకి తెచ్చుకోవడంలో ఆసిమ్ అనుకన్నది సాధించారు.
చారిత్రక నాయకుల ప్రభావం
బెనజీర్ భుట్టో హత్య, ముషారఫ్, నవాజ్ షరీఫ్ దేశాగమనం వంటి ఘటనలు పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్య పాత్రను గుర్తుచేస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మరణ ఆరోపణలు మునీర్‌ను కఠిన పరీక్షలో ఉంచాయి. డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నాడని విమర్శలు పెరగడంతో అతని భవిష్యత్ అనిశ్చితంగా మారింది.
ఫీల్డ్ మార్షల్ నుంచి డిఫెన్స్ చీఫ్‌గా..
పాకిస్తాన్ చరిత్రలో మొదటిసారి ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ పొందిన మునీర్, సుప్రీం కోర్టు, పార్లమెంట్ సవరణల ద్వారా తన కాలాన్ని పొడిగించుకున్నాడు. ఆర్మీ, అధికార పదవుల్లో తన సమీపులను ఉంచి డీప్ స్టేట్‌ను బలోపేతం చేశాడు. అయితే, ఈ చర్యలు సైన్యలో విభజనలు సృష్టించాయి. ఇప్పుడు డిఫన్స్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.
అంతర్యుద్ధ అవకాశాలు..
ఇమ్రాన్ మద్దతుదారుల అల్లర్లు, బలూచిస్తాన్, టీటీపీ సమస్యలు మునీర్ పాలనను దెబ్బతీస్తున్నాయి. మిలిటరీ కూప్ ఊహాగానాలు ఉన్నప్పటికీ, అతను ప్రభుత్వాన్ని కొనసాగించి వెనుముఖం నుంచి నియంత్రించాలని ఎంచుకున్నాడు. దీర్ఘకాలంలో ఈ అస్థిరత అంతర్యుద్ధానికి దారితీయవచ్చు.