Asim Munir claims divine help: చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం కోరురా చిన్నయ్యా అంటే.. ఉరవతల కొండమీద కూర్చుంటా వస్తావా అన్నాడట. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. పహల్గాం మారణకాండకు పాల్పడిన తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టింది. పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపించింది. ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది. దీంతో పాకిస్తాన్ బతికి బట్ట కట్టింది.
ఆ పరిణామం తర్వాత నుంచి పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంది. తనకు అనుకూలమైన వేదికలలో… తనకు అనుకూలంగా మాట్లాడుతోంది. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, ఫీల్డ్ మార్షల్ మునీర్ (Asim Munir) చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.
భారత్ దాడి చేసినప్పుడు పాకిస్తాన్ దేశానికి దేవుడు సహాయం చేశాడట.. ఇదే విషయాన్ని అతడు ఇటీవల ఇస్లామాబాద్ లో జరిగిన నేషనల్ ఉలేమా కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. ” భారత్ దాడి జరిగినప్పుడు పాకిస్థాన్ ఘోరంగా దెబ్బ తిన్నది. ఈ సమయంలో సాయుధ దళాలకు దేవుడు సహాయం చేశాడు. దానిని మేము అనుభూతి చెందామని” మునీర్ వ్యాఖ్యానించడం విశేషం. దీంతో భారత నెటిజన్లు మునీర్ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. ” భారత దాడులను తిప్పికొట్టే సత్తా లేదు. దీంతో రకరకాల మార్గాలలో పాకిస్తాన్ ప్రయత్నాలు చేసింది. చివరికి పాకిస్తాన్ బతుకు జీవుడా అనుకుంటూ బతికి బట్టకట్టింది. ఆ మాత్రం దానికి దేవుడు.. శక్తులు.. అంటూ మాటలు మాట్లాడటం దేనికని” భారత నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఇదే సభలో మునీర్ ఆఫ్ఘనిస్తాన్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ చిన్నారుల రక్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ కళ్ళ చూస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ లో ఉన్న తెహరిక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ ముఠాలలో 70 శాతం మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు ఉన్నారని మునీర్ ఆరోపించారు . ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉగ్రదాడులను ప్రోత్సహించడం తగ్గించుకోవాలని సూచించా