Dhurandhar and Chhaava: గత కొన్ని సంవత్సరాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకి సరైన సక్సెసులు రావడం లేదు. కారణమేంటంటే వాళ్ల నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను మెప్పించడం లేదు. ప్రస్తుతం ఉన్న బాలీవుడ్ ప్రేక్షకులందరు సౌత్ సినిమాల వైపు, అలాగే తెలుగు సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే విక్కీ కౌశల్ హీరోగా శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమా 800 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఇప్పుడు రన్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘దురంధర్’ మూవీ సైతం 850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది… ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరంలోనే రావడం వల్ల ఈ ఇయర్ బాలీవుడ్ ఇండస్ట్రీ మరోసారి తన సత్తా చాటుకుంది… ఇక దురంధర్ మూవీ ఇంకా థియేటర్లో రన్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తుండటం విశేషం… ఒక్క హిందీ భాషలో రిలీజ్ చేసిన ఈ సినిమాకి 850 కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా రిలీజ్ అయి కేవలం 17 రోజులు మాత్రమే అవుతోంది.
ఈ సినిమా లాంగ్ రన్ లో 1000 కోట్లకి పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టే మాదిరిగా కనిపిస్తుందంటూ సినిమా మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు… ఇక ఇదంతా చూసిన చాలామంది ఛావా సినిమాని ముస్లింలకు వ్యతిరేకంగా మన దేశంలో అన్యాయంగా చొరబడి మనల్ని బానిసలుగా మార్చాలని చూసిన ముస్లింలకు వ్యతిరేకంగా తీశారు. కాబట్టి ఆ సినిమా చాలా బాగా ఆడింది.
అలాగే దురంధర్ సినిమాను పాకిస్తాన్ ఉగ్రవాదులు అంతం అందించడానికి తెరకెక్కించారు.కాబట్టి ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ను సాధించింది. మొత్తానికైతే ఇటు హిందూ మతం కి ఫేవర్ గా, అలాగే పాకిస్థాన్ మీద మనవాళ్ళు చేసే యుద్ధం నేపథ్యంలో సినిమా వస్తే సూపర్ సక్సెస్ ను సాధిస్తుందని అందరు అనుకుంటున్నారు.
కానీ ఇలా చాలా సినిమాలు వచ్చినప్పటికి అందులో కొన్ని సినిమాలు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా సినిమా ఉంటే అది సూపర్ సక్సెస్ అవుతోంది. అంతే తప్ప హిందువులకు, ఈ దేశానికి ఫేవర్ గా సినిమా తీసినంత మాత్రన సినిమాలు ఆడవు…