Homeఅంతర్జాతీయంArtemis 2 safe landing: సురక్షితంగా దిగిన ఆర్టెమిస్‌–2.. చంద్రయానం ఇక సేఫ్‌!

Artemis 2 safe landing: సురక్షితంగా దిగిన ఆర్టెమిస్‌–2.. చంద్రయానం ఇక సేఫ్‌!

Artemis 2 safe landing: చందమామ మనకు నిత్యం కనిపించే ఉప గ్రహం. కానీ దానిపై దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. గతంలో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై అడుగు పెట్టినట్లు చరిత్ర చెబతుతోంది. దశాబ్దాల తర్వాత తాజాగా నాసా చంద్రుడిపైకి పరిశోధకులను పంపించింది. పది రోజుల యాత్ర విజయవంతమైంది. నలుగురు పరిశోధకులు విజయవంతంగా యాత్రం పూర్తిచేసుకుని క్షేమంగా తిరిగి వచ్చారు. ఏప్రిల్‌ 1న ఆర్టెమిస్‌–2లో బయల్దేరిన ఆస్ట్రోనాట్లుల.. 4,06,771 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అపోలో–13 రికార్డు బ్రేక్‌ చేశారు. చంద్రుని అవతలి వైపు 90 కిలోమీటర్ల ఎత్తులో ఆర్బిట్‌ చేశారు. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5:38 గంటలకు సాన్‌డియాగో సమీపంలో పసిఫిక్‌ ఓషన్‌లో ఓరియన్‌ క్యాప్సూల్‌ స్ప్లాష్‌డౌన్‌ అయింది.

ల్యాండింగ్‌ ఆపరేషన్స్‌ ఇలా..
రీఎంట్రీ సమయంలో గంటకు 40 వేల కిలోమీటర్ల స్పీడ్‌తో 2,760 డిగ్రీల సెల్సియస్‌ ప్లాస్మా 6 నిమిషాల బ్లాక్‌ఔట్‌తో దూసుకొచ్చింది. 3 మెయిన్‌ ప్యారాచూట్లు, రెండు డ్రాగ్‌ చూట్లు ల్యాండింగ్‌ ఎర్రర్‌ని సరిచేశాయి. యూఎస్‌ఎస్‌ రాకెట్‌షిప్, హెలిక్యాప్టర్లు 45 నిమిషాల్లో అస్ట్రోనాట్లను ఎక్స్‌ట్రాక్ట్‌ చేశారు. మెడికల్‌ క్వారంటైన్‌కు తరలించారు.

వీడియో విడుదల చేసిన నాసా..
ఈ యాత్ర విజయవంతంపై నాసా వ్యోమగాములకు స్వాగతం చరిత్ర మలుపు‘ అని లైవ్‌ వీడియోలు షేర్‌ చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో ‘అద్భుత ప్రయాణం, పరిపూర్ణ ల్యాండింగ్‌.. వైట్‌హౌస్‌ మీట్, నెక్ట్స్‌ మార్స్‌‘ అని అభినందించారు.

మిషన్‌ ఓవర్వ్యూ..
నాసా ఆర్టెమిస్‌–2 మిషన్‌ (నవంబర్‌ 2025 లాంచ్‌) 10 రోజుల చంద్ర కక్ష్య ప్రయాణం పూర్తి చేసి, ఓరియన్‌ క్యాప్సూల్‌తో భూమికి తిరిగి వచ్చింది. నలుగురు అస్ట్రోనాట్లు (రెజినా వెర్బర్, విక్టర్‌ గ్లోవర్‌ మొదలైనవారు) సురక్షితంగా ల్యాండ్‌. రీఎంట్రీ మిషన్‌లో అత్యంత రిస్కీ దశ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

రీఎంట్రీ ఫేజ్‌లు..
అట్మాస్ఫియరిక్‌ ఎంట్రీ.. భూవాతవరణంలోకి గంటకు 40 వేల కిలోమీటర్ల వేగంతో 120 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశించింది. దీంతో ఏర్పడిన ఘర్షణతో 2,760 డిగ్రీల సెల్సియస్‌ వేడి ఉత్పన్నమైంది. ఆక్సిజన్‌ ఐయనైజ్‌ అయి ఎర్రటి ప్లాస్మా గోళాలు ఏర్పడటం రేడియో సిగ్నల్స్‌ 6 నిమిషాలు కట్‌ అయ్యాయి. అబ్లేటివ్‌ మెటీరియల్‌ (ఫెనాలిక్‌ రెజిన్‌) 3,000 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణ్రోగ్రతను భరిస్తూ వేడిని తగ్గించింది. తర్వాత 1200 మీటర్ల ఎత్తులో ప్యారాచూస్టుపెన్‌ కావడంతో పసిఫిక్‌ మహాసముద్రంలో సేఫ్‌గా ల్యాండ్‌ అయింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version