Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy new business: మీడియా రంగంలోకి విజయసాయిరెడ్డి.. అసలు ప్లాన్ ఇదీ

Vijayasai Reddy new business: మీడియా రంగంలోకి విజయసాయిరెడ్డి.. అసలు ప్లాన్ ఇదీ

Vijayasai Reddy new business: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు విజయసాయిరెడ్డికి( Vijaya Sai Reddy) వ్యవసాయం అంతగాగిట్టుబాటు అయినట్టు లేదు. అందుకే ఇప్పుడు మీడియా వ్యాపారంలో అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట విజయ్ సాయి రెడ్డి. అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటించారు. అయితే మీడియాను ఏర్పాటు చేస్తానని ఇదివరకే చెప్పుకొచ్చారు విజయ సాయి రెడ్డి. కానీ ఆ పని చేయలేదు. అయితే ఇప్పుడు డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ప్రారంభించబోతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా.. కేవలం ప్రజల పక్షాన నిలబడి.. వాస్తవాలను వెలికి తీస్తామని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా సామాన్యులు, రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను హైలెట్ చేయడమే ముఖ్య ఉద్దేశం గా పేర్కొన్నారు.

వైసీపీలో ఉన్నప్పుడే..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో ఉన్నప్పుడే మీడియాను ప్రారంభిస్తానని పలు సందర్భాల్లో చెప్పారు విజయసాయిరెడ్డి. అప్పట్లో రామోజీరావు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడులను హెచ్చరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాస్కోండి తన మీడియా సైతం వస్తుందని హెచ్చరికలు పంపారు. తరువాత వైసిపి నుంచి బయటకు వెళ్లినప్పుడు కూడా మీడియాను ఏర్పాటు చేస్తానని చెప్పారు. కానీ ఎప్పటికప్పుడు తాత్సారం జరుగుతూ వచ్చింది. కానీ ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా డిజిటల్ మీడియాలోకి అడుగు పెడతానని చెబుతున్నారు. అది విజయవంతం అయిన తర్వాత పూర్తిస్థాయి తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్ ను లాంచ్ చేయాలనేది తన విజన్ అని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పొలిటికల్ జంక్షన్ లో నిలబడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కూటమి పార్టీలో చేరలేకపోయారు. రేపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తన విషయంలో జగన్ వేరే ఆలోచన చేయరు. అందుకే మీడియాను ఏర్పాటు చేసుకొని బలమైన వ్యవస్థను తీసుకురావాలని ఆయన చూస్తున్నారు.

రకరకాల వార్తలు..
మొన్న ఆ మధ్యన తన మీడియా ఏర్పాటు విషయంలో చాలా రకాల వార్తలు వచ్చాయి. సీనియర్ మోస్ట్ జర్నలిస్టు ఒకరు ఆయన మీడియా బాధ్యతలు చూస్తారని బయట ప్రచారం జరిగింది. బలమైన మీడియాలో సీఈఓ గా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి కంపెనీలో చేరబోతున్నట్లు కూడా టాక్ నడిచింది. అయితే ఎప్పటికప్పుడు జాప్యం జరుగుతూ వస్తున్న ఈ ప్రక్రియ.. ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రకటనతో వాస్తవం అని తేలింది. త్వరలో డిజిటల్ మీడియాకు సంబంధించిన నియామకాలు, కార్యాలయాల నిర్వహణ కూడా ప్రారంభం కానుంది. మీడియా ఏర్పాటు చేసేందుకు అవసరమైన పెట్టుబడి ఎలానూ ఉంటుంది. మీడియా అన్నది నిర్వహణ చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే ముందుగా డిజిటల్ మీడియాలో అడుగుపెట్టి.. క్రమేపీ మెయిన్ మీడియా వైపు అడుగులు వేయాలన్నది విజయసాయిరెడ్డి ప్రణాళిక. అయితే ఇప్పుడు కొత్తగా మీడియా వ్యాపారంలో అడుగు పెట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు. కానీ ఆ సాహసం చేస్తున్నారు విజయసాయిరెడ్డి. మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version