Homeఎంటర్టైన్మెంట్Ram Charan Bollywood re entry: పీరియడ్ మూవీతో బాలీవుడ్ లోకి రామ్ చరణ్ గ్రాండ్...

Ram Charan Bollywood re entry: పీరియడ్ మూవీతో బాలీవుడ్ లోకి రామ్ చరణ్ గ్రాండ్ రీ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

Ram Charan Bollywood re entry: మన టాలీవుడ్ లో నేటి తరం స్టార్ హీరోలలో పాన్ ఇండియా వైడ్ గా మంచి ఫేమ్ ని సంపాదించుకున్న మొట్టమొదటి హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan). ‘మగధీర’ చిత్రంతో రామ్ చరణ్ రేంజ్ తెలుగు రాష్ట్రాల నుండి పక్క రాష్ట్రాలకు ఎగబాకింది. బాలీవుడ్ లో ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల అవ్వలేదు కానీ , ఒకవేళ అయ్యుంటే మాత్రం ఆరోజుల్లోనే ఈ చిత్రం బాలీవుడ్ నుండి 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేది. అలాంటి క్రేజ్ రామ్ చరణ్ సొంతం. ఆయనకు బాలీవుడ్ లో ఉన్న ఫేమ్ ని గమనించే, ఆరోజుల్లోనే రిలయన్స్ సంస్థ రామ్ చరణ్ తో ‘జంజీర్’ చిత్రాన్ని తెరకెక్కించింది. అమితాబ్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ‘జంజీర్’ కి రీమేక్. ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫలితాన్ని సొంతం చేసుకుంది.

అయినప్పటికీ కూడా బాలీవుడ్ లో ఈ చిత్రం పాతిక కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. తెలుగు లో ఈ చిత్రం ‘తుఫాన్’ పేరుతో దబ్ అయ్యి విడుదలైంది. ఇక్కడ కూడా అదే రేంజ్ డిజాస్టర్ ఫలితాన్ని సొంతం చేసుకొవాల్సి వచ్చింది. దీంతో రామ్ చరణ్ మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు. టాలీవుడ్ మీదనే పూర్తి స్థాయి ఫోకస్ పెట్టి, ఇక్కడ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా నిలిచాడు. అయితే బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం రామ్ చరణ్ ఒక డైరెక్ట్ హిందీ మూవీ చేస్తే చూడాలని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. కానీ రామ్ చరణ్ కి ఉన్నటువంటి ముందస్తు కమిట్మెంట్స్ కారణంగా ఆయన బాలీవుడ్ లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వలేకపొతున్నాడు.

అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏంటంటే, బాలీవుడ్ బడా డైరెక సంజయ్ లీల భన్సాలీ రామ్ చరణ్ తో భారీ బడ్జెట్ పీరియడ్ చిత్రం చెయ్యాలని అనుకుంటున్నాడట. రీసెంట్ గా రామ్ చరణ్ ముంబై కి వెళ్ళడానికి కారణం ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ చర్చల కోసమే అని అంటున్నారు. ఈ చిత్రానికి దుర్గేష్ సింగ్ కథ ని సమకూర్చినట్టు తెలుస్తోంది. ఇది ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామా అట. సంజీయ్ లీల భన్సాలీ ఎమోషన్స్ విషయం లో ప్రేక్షకుల హృదయాలను పిండేస్తాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల్లో ఎదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ రామ్ చరణ్ సినిమాకు రిపీట్ అవుతుందో లేదో చూడాలి. ‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ చెయ్యబోయే సినిమా ఇదే కావొచ్చు. ఎందుకంటే సుకుమార్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట. అందుకే ముందుగా ఈ చిత్రాన్ని మొదలు పెట్టాలనే ఆలోచిస్తున్నట్టు సమాచారం .

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version