Maruti That is Booming in Sales: బడ్జెట్ లో కారు కొనాలని అనుకునే వారికి మారుతి కంపెనీ కార్లు అందుబాటులో ఉంటాయి. అత్యధిక మైలేజ్ తో కూడిన కార్లను కూడా మారుతి నుంచి ఇప్పటి వరకు చాలా రిలీజ్ అయ్యాయి. వీటిలో వ్యాగన్ ఆర్, స్విప్ట్ తదితర కార్లు ఉన్నాయి. అయితే మారుతి కంపెనీ నుంచి కేవలం హ్యాచ్ బ్యాక్ కార్లు మాత్రమే కాకుండా ప్రీమియం ఫీచర్లను కలిగిన కార్లు కూడా ఉన్నాయి. ఇవి SUVలతో పోటీ పడుతూ సేల్స్ లో ముందంజలో ఉంటున్నాయి. వీటిలో ఓ కారు కేవలం 19 నెలలో 1.50 లక్షల యూనిట్లు విక్రయాలు జరుపుకుంది. దీంతో ఈ కారుకు ఎంత ఆదరణ ఉందో తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?
సొంత కారు కొనాలని నేటి కాలంలో చాలా మంది అనుకుంటున్నారు. అయితే వీరిలో ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు. బడ్జెట్ లో కారు కొనాలని అనుకునే వీరికి మారుతి కంపెనీ Fronx అనుగుణంగా ఉంటుంది. ఇది ప్రీమియం ఫీచర్లను కలిగి అత్యాధునిక కారు వలె ఆకర్షణీయమైన డిజైన్ తో కూడుకొని ఉంది. మారుతి ఫ్రాంక్స్ ఇదే కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా వలె ఫీచర్లనుకలిగి ఉంది. ఇందులో ఎల్ ఈడీ, డీఆర్ఎల్, మల్టీ రిప్లెక్టర్ హెడ్ ల్యాంప్స్ వంటివి ఉన్నాయి. 16 అంగుళాల డైమంట్ కట్ వీల్స్ ఆకర్షిస్తుంది.
ఫ్రాంక్స్ ఇన్నర్ ఫీచర్ విషయానికొస్తే.. ఇందులో 9 అంగుళాల ప్లస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను కలిగి ఉంది. అలాగే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ఆటో ప్లే సపోర్టు చేస్తుంది. వైర్ లెస్ చార్జర్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. సేప్టీ విషయంలో ఈ కారు ముందంజలో ఉంది. ఇందులో 360 డిగ్రీ కెమెరా, ఇంజిన్ స్టార్ట్ ఆఫ్ , కీలెస్ ఎంట్రీ, రివర్స్ పార్కింగ్ కెమెరా, రేర్ డిఫాగర్ వంటివి ఉన్నాయి. పూర్తిగా మల్టీ ఫంక్షన్ ఫీచర్స్ కలిగిన ఈ కారు ఇంజిన్ తీరు ఎలా ఉందంటే?
ఈ కారులో 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటేడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ పై 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది. మారుతి ఫ్రాంక్స్ ప్రారంభ ధర రూ. 7.51 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తుండగా.. టాప్ ఎండ్ రూ.13.08 లక్షలతో విక్రయిస్తుస్తున్నారు. పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ లో అందుబాటులో ఉంది. అయితే నేటి కాలంలో కొత్త ఫీచర్లను కలిగి కార్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.
మారుతి నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్రీమియం లుక్ తో పాటు అప్డేట్ ఫీచర్లను కలిగిన మారుతి ఫ్రాంక్స్ వైపు ఇపపుడు వినియోగదారులు మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా ఇది 99 బీహెచ్ పీ పవర్ తో పాటు 147.6 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే ఈ కారు సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.