US Citizenship: అమెరికా వెళ్లిన భారతీయ బామ్మకు 99 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం లభించింది. ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్ సీఐఎస్) తన అధికారిక ఎక్స్ వేదికగా ప్రకటించింది. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అనడానికి ఇదే నిదర్శనం.
భారత్‌కు చెందిన దైబాయి(99) అమెరికా సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేసుకుంది. అనేక ప్రయత్నాల తర్వాత అక్కడి ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చింది. అయితే అప్పటికే ఆమె వయసు 99 ఏళ్లు. ఈ విషయం గురించి యూఎస్ సీఐఎస్ ఎక్స్ ఖాతాలో ఇలా రాసింది. ‘మా ఓర్లాండో కార్యాలయానికి ఆమె ఉత్సాహంగా వచ్చారు. యూఎస్ కొత్త సిటిజన్‌కు మా అభినందనలు’ అని పోస్టు చేసింది. ఇక దైబాయికి అమెరికా పౌరసత్వం లభించడంపై పలువురు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. కాగా మరికొందరు ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నిస్తున్నారు.
పెండింగ్ దరఖాస్తులు క్లియర్‌చేస్తూ..
యూఎస్‌సీఐఎస్ వలసదారుల వీసా పిటిషన్లు, సహజీకరణ దరఖాస్తులు, ఆశ్రయం దరఖాస్తులు, గ్రీన్‌కార్డు దరఖాస్తులను నిర్వహించే బాధ్యతలను కలిగి ఉంది. యూఎస్‌లో పని చేయడానికి వందలాది మంది భారతీయు టెక్కీలు ఉపయోగించే హెచ్–1బీ వీసా వంటి వలసేతర తాత్కాలిక ఉద్యోగుల కోసం కూడా ఏజెన్సీ పిటిషన్లను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో దైబాయికి సిటిజన్ షిప్ జారీ చేజింది. దైబాయి కొన్నాళ్లుగా తన కూతురుతో కలిసి ఫ్లోరిడాలో ఉంటోంది.