Hyundai Cars: కార్లపై సంచలన నిర్ణయం తీసుకున్న హ్యుందాయ్…వినియోగదారులు గమనించండి..

హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిప్ట్ ను లాంచ్ సమయంలో రూ.11 లక్షల ప్రారంభం నుంచి రూ.20 లక్షల వరకు నిర్ణయించాలి. ఇటీవల హ్యుందాయ్ పెట్రోల్ వేరియంట్లు ఉన్న తన మోడళ్లపై రూ.3,500 పెంచింది. 1.5 లీటర్ సీఆర్డీఐ డీజిల్ ఉన్న ఇతర వేరియంట్లను సైతం రూ.10,800 పెంచినట్లు ప్రకటించింది.

Written By: Chai Muchhata, Updated On : April 7, 2024 9:09 am

Hyundai India

Follow us on

Hyundai Cars:  కార్ల ఉత్పత్తిలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీలతో పోటీ పడీ మరి వినియోగదారులను ఆకర్షించేలా కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ తరుణంలో హ్యుందాయ్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా క్రెటా ఇంప్రెస్ చేసింది. ఈ క్రెటా ఫేస్ లిప్ట్ గా ఈ ఏడాది జనవరిలో లాంచ్ చేసిన విషయం తెలిసింది. ఇప్పటి వరకు దీనిని వినియోగదారులు ఆదరిస్తున్నారు. అయితే తాజాగా ఈ మోడల్ పై ధరలను పెంచింది కంపెనీ. ఈ నేపథ్యంలో తాజాగా దీని ధర ఎలా ఉందో తెలుసా?

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా కొన్ని కార్ల కంపెనీలు ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హ్యుందాయ్ సైతం తన క్రెటా ఫేస్ లిప్ట్ పై స్వల్పంగా ధరను పెంచింది. కొత్తగా వచ్చిన ఈ మోడల్ కారు వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇందులో 1.5 లీటర్ ఇంజిన్ తో మాన్యువల్ గేర్ బాక్స్ , డీసీటీ ట్రాన్స్ మిషన్ ను అమర్చారు. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ లో మాత్రం పాత క్రెటాలో మాదిరిగానే ఉంచారు. డీజిల్ వేరియంట్లలో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను అమర్చారు.

కొన్ని ఫీచర్స్, డిజైన్ విషయంలో పాత క్రెటా కంటే ఫేస్ లిప్ట్ అనేక మార్పులు చేసుకుంది. ఇందులో ఎక్స్టీరియర్ డిజైన్ తో పాటు ఆధునాతన లుక్ అదరగొడుతోంది. లెవల్ 2 ADAS టెక్నాలజీని కలిగి ఉంది. డిజైన్ విషయానికొస్తే కొత్త గ్రిల్, ఎల్ ఈడీ డీఆర్ఎల్, హెడ్ లైట్ సెటప్ ఉన్నాయి. ముందు భాగంలో కొత్త బంపర్, రీ డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ టెయిల్ లైట్లు, వెనుక భాగంలో ట్వీక్డ్ బంపర్ తో ఆకర్షణీయంగా ఉన్నాయి. క్యాబిన్ సైతం కొత్త తరహాలో ఆకర్షిస్తుంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిప్ట్ ను లాంచ్ సమయంలో రూ.11 లక్షల ప్రారంభం నుంచి రూ.20 లక్షల వరకు నిర్ణయించాలి. ఇటీవల హ్యుందాయ్ పెట్రోల్ వేరియంట్లు ఉన్న తన మోడళ్లపై రూ.3,500 పెంచింది. 1.5 లీటర్ సీఆర్డీఐ డీజిల్ ఉన్న ఇతర వేరియంట్లను సైతం రూ.10,800 పెంచినట్లు ప్రకటించింది. సేప్టీ విషయంలోనూ క్రెటా ఫేస్ లిప్ట్ ఆకట్టుకుంటుంది. ఇందులో కొత్త డ్రైవర్ డిస్ ప్లే, డ్యూయెల్ స్క్రీన్ సెటప్, ఆధునిక ఎయిర్ కండిషన్ వెంట్స్ ఫీచరలతో పాటు మరిన్ని సేప్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.