Elon Musk : అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. 2025, జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన తన క్యాబినెట్ మంత్రులు, వైట్‌హౌస్ కార్యవర్గాన్ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలువురు విధేయులకు మంత్రి పదవులు ప్రకటించారు. తన గెలుపులో భాగస్వామి అయిన మస్క్, వివేక్ రామస్వామి, జాన్ ఎస్.కెన్నడీ జూనియర్‌కు కీలక పదవులు ఇచ్చారు. ఇక ట్రంప్ గెలుపుతో ఆయన మద్దతు దారు అయిన బిలయనీర్, టెస్లా, ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ సేర్లు గణనీయంగా పెరిగాయి. అయితే.. తాజాగా ఎక్స్ మస్క్‌ను కలవర పెడుతోంది. మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ నుంచి అమెరికన్లు పెద్ద సంఖ్యలో ఎగ్జిట్ అవృతున్నారు. ఇలా ఎక్స్‌ను వీడినవారంతా.. బ్లూ స్కైలో చేరుతున్నారు. దీంతో ఈ కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫాం అతి తక్కువ కాలంలోనే 10 మిలియన్ల సబ్‌స్క్రిప్షన్లు సొంతం చేసుకుంది.
కారణాలు ఇవే..
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయంలో ఎలాన్ మస్‌్క కీలక పాత్ర పోషించారు. ట్రంప్ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిధులు సమకూర్చడంలోనూ కీలక పాత్ర పోషించారు. ట్రంప్ గెలుపునే మెజారిటీ అమెరికన్లున జీర్ణించుకోవడం లేదు. ఈ క్రమంలో ఆయనకు మద్దతు తెలిపిన మస్క్‌పై గుర్రుగా ఉన్నారు. తమ కోపాన్ని ఎక్స్ నుంచి ఎగ్జిట్ అవుతూ నిరసన తెలుపుతున్నారు. ట్రంప్ గెలుపులో ‘ఎక్స్’ కీలక పాత్ర పోషించదని భావిస్తున్నవారు.. ప్రత్యామ్నాయ సోషల్ మీడియావైపు చూసు‍్తన్నారు. ఈ క్రమంలో చాలా మంది ఎక్స్ నుంచి వీడి.. బ్లూస్కైలో చేరుతున్నారు. ఎక్స్ ఇటీవల సవరించిన కండీషన్స్ కూడా ఎన్స్‌ను వీడడానికి కారణంగా తెలుస్తోంది.
బ్లూ స్కై ఎవరిది..?
ట్విట‍్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే కొత్తగా స్థాపించిన సోషల్ మీడియానే ఈ బ్లూ స్సై. 2019లో దీనిని రూపొందించారు. మొదట ఇన్విటేషన్ ఆధారంగా తీసుకొచ్చారు. ఈ ఏడాది నుంచే పూర్తిస్థాయిలో యూజర్లు అందుబాటులోకి వస్తున్నారు. ఈ ఏడాది సెపె‍్టంబర్ 10 వరకు 10 మిలియన్ యూజర్లు మాత్రమే ఉండగా, అమెరికా ఎన్నికల తర్వాత బ్లూస్కై క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం 19 మిలయన్ యూజర్లతో ట్రెండింగ్‌లో ఉంది.
పనితీరు ఇలా..
బ్లూ స్కై సోషల్ మీడియా ప్లాట్‌ఫాం కూడా ఎక్స్ లాగానే పనిచేస్తుంది. ఫొటోలు, వీడియోలు, డైరెక్ట్ మెస్సేజ్‌ల పంపిచొచ్చు. ఇందులో యూజర్లు ఫాలో అయ్యే అకౌంట్ల నుంచి ఫీడ్ మాత్రమే చూపిస్తుంది. వ్యక్తులే తమ స్పీడ్‌ను కస్టమైజ్ చేసుకునే సదుపాయం ఉంది. ఇక యూజర్ల డేటా మిగతా కంపెనీల తరహాలో కంపెనీ సొంత సర్వర్‌లో ఉండదు. యూజర్లు కావాలంటే సొంత సర్వర్లను వాడుకోవచ్చు. సంస్థ సర్వర్‌పై ఆధారపడొచ్చు. ఎక్స్‌కు పోటీగా వచ్చిన మెటాకు చెందిన థ్రెడ్స్ దాని అల్గారిథమ్ పొలిటికల్ పోస్టులకు ప్రాముఖ్యం ఇవ్వకపోవడం బ్లూస్కైకి కలిసి వచ్చింది.