American Media: అమెరికన్ మీడియా.. ప్రపంచ మీడియాకు ఆదర్శం అని చాలా మంది భావిస్తారు. వర్దమాన దేశాలు, మూడో ప్రపంచ దేశాలు అమెరికాను చూసి నేర్చుకుంటాయి. అమెరికా మీడియా ఎవరికీ భయపడదు.. పాలకులకు జంకదు.. తప్పులను బయట పెడుతుది అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిప్రాయం. మన దేశంలో మీడియా కూడా ఇంగ్లండ్, అమెరికా మీడియాను దైవంగా చూస్తాయి. అనుకరిస్తాయి. కానీ, తాజాగా వెనుజువెలాపై అమెరికా చేసిన దాడికి సంబంధించిన సమాచారం అమెరికాలోని రెండు ప్రముఖ మీడియా సంస్థలకు ముందే తెలుసు. సెమ ఫోర్ అనే సంస్థ ఒక ఇన్వెస్టిగేషన్ కథనం ప్రచురించింది. న్యూయార్క్ టైంస్, వాషింగ్‌టన్ పోస్టుకు వెనెజువెలాపై దాడి, మదురో అపహరణకు సంబంధించిన సమాచారం ఉందని పేర్కొంది. అమెరికా ప్రభుత్వం చెప్పిన కారణంగా దేశ భద్రత, దేశ రక్షణ దృష్ట్యా బయటకు పెట్టలేదు. అమెరికా ప్రభుత్వం చెప్పగానే తలొగ్గి ప్రచురించలేదు. ఇదే అమెరికా మీడియా భారత్ వంటి ఎదుగుతున్న దేశాలకు చాలా సుద్దులు చెబుతుంది.
దేశ భద్రతకు ప్రాధాన్యత
అమెరికా ప్రభుత్వం దేశ భద్రత కారణంగా సమాచారం దాచమని చెప్పగానే మీడియా దేశం కోసం మౌనంగా ఉండిపోయింది. ఇది భారతీయ మీడియాకు విమర్శలు చెప్పుకుంటూ తాను అనుసరించిన మార్గం. కానీ మన ప్రభుత్వాలు చేసే భద్రతకు సంబంధించిన విషయాలను కూడా మన మీడియా లీక్ చేస్తుంది. రంగారెడ్డి జిల్లాలో రాడార్ కేంద్రం ఏర్పాటుపై మీడియా హంగామా చేసింది. కానీ ఈ రాడార్ కేంద్రాలు, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌ను మనం దెబ్బకొట్టడంలో కీలకంగా పనిచేశాయి. మీడియా మాత్రం రాడార్ కేంద్రం ఎందుకు అన్నట్లుగా వ్యవహరించింది. భత్రద విషయంలో అమెరికా మీడియా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించింది.
చారిత్రక ఉదాహరణలు..
అమెరికాలో మీడియా అనేక పర్యాయాలు భద్రత విషయంలో ప్రభుత్వానికి తలొగ్గింది. 1961లో క్యూబాపై దాడి విషయం న్యూయార్క్ టైమ్స్‌కు ముందుగా తెలుసు. కానీ ప్రభుత్వ ఆదేశంతో ప్రచురణ ఆపింది. ఇక జార్జ్ బుష్ సమయంలో ఎన్‌ఎస్‌ఏ కార్యకలాపాలు తెలిసినా మౌనంగా ఉండిపోయింది. కోల్డ్ వార్‌లో అపహరణలు, మాకింగ్ బర్డ్ వంటివి దాచారు. ఇరాక్‌తో యుద్ధ సమయంలో అమెరికా కోసం ప్రూఫ్ లేకుండా ప్రచురించి దాడికి తోడ్పాటు అందించింది అమెరికా మీడియా. ఈ చర్యలు చమురు, వనరుల కోసం డీప్ స్టేట్‌కు సహకరించాయి.
భారత మీడియాతో పోలిక
భారత్‌లో మీడియా కార్గిల్ యుద్ధం, 2008 ముంబై దాడిలో సైనిక కదలికలు లైవ్ చూపించి శత్రువులకు సహాయం చేసింది. నక్సలైట్లకు మద్దతు, రాడార్ వ్యతిరేకతలు దేశ భద్రతకు ముప్పు. అమెరికా మీడియా నుంచి మన మీడియానేర్చకోవాల్సింది ఏమైనా ఉంది అంటే అది దేశభక్తి. భద్రత విషయంలో దేశానికి మొదటి ప్రాధాన్యం ఇస్తుంది అమెరికా మీడియా.
అమెరికా మీడియా ప్రభుత్వ విమర్శలు చేస్తూ దేశ భద్రత సమయంలో అనుసరించుతుంది. భారత్‌లో వ్యతిరేకతలు జాతి ముప్పును పెంచుతున్నాయి. సమతుల్య జర్నలిజం అవసరం.