American Brand Toilet: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలు, ముఖ్యంగా భారతదేశంపై విధించిన 50% సుంకాలు, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ చర్యలు అమెరికా గ్లోబల్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. మిత్ర దేశాలు కూడా శత్రు దేశాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు జేక్ సుల్లివన్ సహా పలువురు విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జేక్ అమెరికా ఇమేజ్ ఇప్పుడు టాయిలెట్‌లో ఉందని సంచలన వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శం.
ట్రంప్ టారిఫ్‌ల మోత..
ట్రంప్ 2.0 అమెరిన్లతోపాటు ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారింది. ఆయన విదేశీ వాణిజ్యంపై కఠిన విధానాలను అమలు చేస్తున్నారు. భారతదేశం, బ్రెజిల్ వంటి బ్రిక్స్ సభ్య దేశాలపై 50% సుంకాలు విధించడం ద్వారా, అమెరికా ఆర్థిక సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులు, బ్రిక్స్ కూటమిలో భారతదేశం భాగస్వామ్యం ఈ సుంకాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అయితే, ఈ నిర్ణయాలు అమెరికా గ్లోబల్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయి. జేక్ సుల్లివన్ వంటి విమర్శకులు ట్రంప్ టారిఫ్ విధానాలను ఒక విఘాతకర శక్తిగా పేర్కొన్నారు. ఈ విధానాలు మిత్ర దేశాలతో సహకారాన్ని క్షీణింపజేస్తూ, అనేక దేశాలను చైనా వైపు మొగ్గేలా చేస్తున్నాయని సుల్లివన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యలు దీర్ఘకాలిక దౌత్య, ఆర్థిక సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే అమెరికా పరువు బాత్‌రూంలోకి దిగజారిందని పేర్కొన్నారు.
భారతదేశంపై టారిఫ్ ప్రభావం
భారతదేశంపై విధించిన 50% సుంకాలు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలలో ఉద్రిక్తతలను సృష్టించాయి. రష్యా నుంచి∙చమురు దిగుమతులను కొనసాగించడం, బ్రిక్స్ కూటమిలో భారతదేశం పాత్ర ఈ సుంకాలకు కారణాలుగా చెప్పబడుతున్నాయి. ఈ చర్యలు భారతదేశం ఎగుమతి రంగంపై, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, యంత్రాలు, మరియు బంగారం వంటి రంగాలపై ప్రభావం చూపనున్నాయి. ఇదే సమయంలో ట్రంప్ యొక్క టారిఫ్ నిర్ణయాలు భారతదేశాన్ని చైనాకు దగ్గర చేస్తున్నాయి. ఈ పరిణామం అమెరికా ఇండో–పసిఫిక్ వ్యూహానికి సవాల్‌గా మారవచ్చు,
బ్రిక్స్ కూటమి బలోపేతం..
బ్రిక్స్ సభ్య దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు, ఈ కూటమిని అమెరికా వ్యతిరేక శక్తిగా మారుస్తున్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా ఈ సుంకాలను బ్రెజిల్ యొక్క సార్వభౌమత్వంపై దాడిగా వర్ణించారు. ఈ చర్యలు బ్రిక్స్ దేశాలను మరింత సమన్వయంతో కూడిన ఆర్థిక కూటమిగా మార్చే అవకాశం ఉంది, ఇది అమెరికా గ్లోబల్ ఆర్థిక ఆధిపత్యానికి సవాల్‌గా మారుతుంది. మరోవైపు భారతదేశం జపాన్, యూరోపియన్ యూనియన్ వంటి ఇతర భాగస్వాములతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా ఈ సుంకాల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
భారతదేశం అలీన విధానం ఈ సందర్భంలో దానికి ఒక బలంగా నిలుస్తోంది. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ, భారతదేశం చైనా, రష్యా, ఇతర బ్రిక్స్ దేశాలతో సహకారాన్ని కొనసాగిస్తోంది. ఈ బహుముఖ విధానం భారతదేశాన్ని గ్లోబల్ రాజకీయాలలో ఒక సమతుల్య శక్తిగా నిలబెట్టడమే కాక, అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా అందిస్తోంది.