American aircraft: ప్రపంచంలో అన్ని విషయాల్లో అత్యంత శక్తివంతమైన దేశం ఏదంటే అమెరికా పేరు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పేరును చెరిపేయడానికి చైనా ఎంతో ప్రయత్నిస్తోంది. అమెరికా కంటే ఎక్కువ టెక్నాలజీని వాడుకుంటూ.. అడ్వాన్స్ గా రక్షణ ఆయుధాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో జరిగే యుద్ధం వస్తే ఏం చేయాలి
? అది అమెరికాతో వస్తే ఎలా ఎదుర్కోవాలి? అనే దానిపై ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా అమెరికాకు ఒక షాకింగ్ విషయం చైనా గురించి తెలిసింది. అది ఏంటో తెలుసా?
ఇటీవల అమెరికాకు చెందిన శాటిలైట్ కు చైనాలోని ఒక ప్రాంతానికి చెందిన ఆకారం కనిపించింది. చైనాలో ఉండే Takla Makhan ఎడారి ప్రాంతంలో ఒక షిప్ ఉన్నట్లు అమెరికా శాటిలైట్ గుర్తించింది. వాస్తవానికి ఈ ఆకారం కలిగిన షిప్ అమెరికా వద్ద మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ఎందుకు ఉన్నట్లు అని అనుమానించింది. సముద్రానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎడారి ప్రాంతంలో షిప్ ఉండడమేంటి? అన్న అనుమానాలు వ్యక్తం చేసింది. దీని గురించి ఆరా తీయగా అమెరికాకు ఒక విషయం తెలిసిపోయింది.
అమెరికాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ షిప్ సముద్రంలో అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ షిప్ తో ఏ దేశానైనా ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. అయితే చైనా ఇలాంటి డమ్మీ షిప్ ను తయారు చేసింది. దీని కింద ఒక ట్రాక్ ఏర్పాటు చేసి.. ఆ షిప్ కదిలితే దానిపై ఎలా దాడి చేయాలి? అన్న దానిపై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తుంది. అందుకుగాను షిప్ ను కృత్రిమంగా కదుపుతూ.. దానిపై దాడులు చేస్తుంది. అంటే భవిష్యత్తులో అమెరికాతో చైనా యుద్ధం చేసే అవకాశాలు ఉన్నాయని ముందే భావిస్తుంది. ఇందులో భాగంగా యుద్ధం ను ఎదుర్కొనేందుకు చైనా ఇప్పటినుంచే అన్ని రకాలుగా సిద్ధంగా మారుతుంది. అంటే అమెరికాకు చెందిన షిప్ లు మాత్రమే కాకుండా మిలిటరీని ఎలా ధ్వంసం చేయాలో ఇప్పటినుంచే సిద్ధమవుతోంది.
ఇప్పటికే టెక్నాలజీ రంగంలో అమెరికా కంటే ఎక్కువగా చైనా ముందుకు పోతోంది. ఇప్పుడు యుద్ధంలో కూడా ఎదుర్కొనే స్థాయిలో ఎదుగుతుంది. ఆసియా ఖండంలో ఉన్న చైనా.. యూరోప్ లో ఉన్న అమెరికాపై జయిస్తే ప్రపంచ విజేతగా చైనా నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న అమెరికా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తుందో చూడాలి.